Citroen C3 కారు అంచనాలను అందుకుందా? ఫస్ట్ డ్రైవ్ రివ్యూ- వీడియోలో చూడండి
15 June 2022, 15:22 IST
ఫ్రెంచ్ కార్ మేకర్ సిట్రోయెన్ తమ బ్రాండ్ నుంచి C5 ఎయిర్‌క్రాస్ SUV తర్వాత రెండవ మోడల్ సిట్రోయెన్ C3 అనే కాంపాక్ట్ SUVని లాంచ్ చేస్తోంది. జూలై 20న ఈ కార్ అధికారికంగా భారత మార్కెట్లోకి రాబోతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి సేల్స్ సాధించిన ఈ కార్ భారత్‌లోనూ ప్రజాదరణ పొందుతుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. C3లో 1.2-లీటర్ టర్బో ఇంజన్ లేదా 1.2-లీటర్ NA ఇంజన్ ఉంటుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్సుకు జతచేశారు. ఇందులో ఆటోమేటిక్ వెర్షన్ లేదు. మరి ఇందులో ప్రయాణ అనుభూతి ఎలా ఉంటుందో హెచ్‌టీ ఆటోమొబైల్ విభాగం చేసిన ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ఈ వీడియోలో చూడండి.