Chocolate | డార్క్ చాక్లెట్ స్వచ్ఛతను ఎలా గుర్తించవచ్చు?
28 April 2022, 20:24 IST
- చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం, అమ్మాయిలకైతే ప్రాణం. మరి ఆ చాక్లెట్లలోని వెరైటీలు ఇతర సమాచారాన్ని ఆహార పదార్థాల నిపుణులు, రచయిత, పరిశోధకులు శ్వేత శివకుమార్ వెల్లడించారు. ఆమె ప్రకారం చాక్లెట్ అని రాసిలేనివి చాక్లెట్స్ కాదు, అవి క్యాండీ బార్లు. కొకొ పౌడర్ ఉపయోగించి చేసిన వాటిని చాక్లెట్స్ అంటారు. ఇందులోనూ మిల్క్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ అని ఉంటాయి. మిల్క్ చాక్లెట్లలో కొకొ పౌడర్ శాతం తక్కువ ఉంటుంది. డార్క్ చాక్లెట్లలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత ఎక్కువ శాతం కొకొ ఉంటే అంత తక్కువ శాతం చక్కెర, ఇతర ముడిపదార్థాల వినియోగం ఉంటుంది. 100% కొకొ ఉండేవి స్వచ్ఛమైన డార్క్ చాకెట్లు. ఒకవేల కంపెనీలు కొకొ శాతం వెల్లడించకపోతే షుగర్ శాతం చూడాలి, అప్పుడు తెలిసిపోతుంది అదెంత స్వచ్ఛమైనది అని. ఈ వివరాలు వీడియోలో చూడండి..