తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  2023 Kia Telluride | ఫస్ట్‌లుక్ తోనే అదరగొట్టిన కియా ఫుల్ సైజ్ Suv టెల్యురైడ్!

2023 Kia Telluride | ఫస్ట్‌లుక్ తోనే అదరగొట్టిన కియా ఫుల్ సైజ్ SUV టెల్యురైడ్!

14 April 2022, 22:53 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ మేకర్ కియా తన బ్రాండ్ నుంచి వచ్చిన మూడు వరుసల హల్క్ SUV కార్ 'Telluride' ను సరికొత్తగా ఆవిష్కరించింది. ఈ కార్ రిలీజైన మూడేళ్ల తర్వాత తొలిసారిగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను తీసుకువస్తుంది. కింగ్ సైజ్ SUVగా కనిపించే ఈ వాహనం డిజైన్ బయట, లోపల పూర్తిగా రిఫ్రెష్‌ చేసింది. ఈ కొత్త కారులో X-Line ఇంకా X-Pro అనే రెండు వేరియంట్లను తీసుకువస్తుంది. సరికొత్త 2023 టెల్యురైడ్ SUVలో ఆకర్షణీయమైన అప్‌డేట్‌లు అందించి, తమ బిజినెస్ విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు కియా తెలిపింది.