India - China Tawang Clash: తవాంగ్ ఘర్షణపై చైనా బుకాయింపు!
13 December 2022, 22:20 IST
- India - China Tawang Clash: డిసెంబర్ 9వ తేదీన తవాంగ్ వద్ద భారత దళాలతో జరిగిన ఘర్షణపై చైనా మిలటరీ మౌనాన్ని వీడింది. భారత సైన్యమే సరిహద్దు దాటి వచ్చిందంటూ బుకాయించింది. ఎప్పటిలాగానే తప్పును కప్పిపుచ్చుకునేందుకు డ్రాగన్ దేశం ప్రయత్నిస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. భారత దళాలు.. ఎల్‍ఏసీని దాటి వస్తే తాము అడ్డుకున్నామని చైనా ఆర్మీ ప్రతినిధి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‍పీ రిపోర్ట్ చేసింది. పరిస్థితి సద్దుమణిగేలా తాము చర్యలు తీసుకున్నామని ఆ ప్రతినిధి చెప్పినట్టు వెల్లడించింది. కాగా, ఈనెల 9వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‍లోని వాస్తవ నియంత్రణ రేఖ వద్ద సరిహద్దు దాటి వచ్చిన చైనా దళాలను భారత సైనికులు తిప్పికొట్టారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణలో ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి.