తెలుగు న్యూస్  /  Video Gallery  /  Funny Moment At Ipl Psl T10 League

గ్రౌండ్ లో ఆస్ట్రేలియా టీవీ ప్రజెంటర్ ను ఎత్తుకున్న మాజీ క్రికెటర్ మోరిసన్

08 March 2023, 20:13 IST

  • పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్ విజయవంతంగా నడుస్తోంది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ లీగ్లో కామెంటర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ మాజీ క్రికెటర్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి వేరుగా ఉంటుంది. తాజాగా డానీ మోరిసన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియన్ టీవీ ప్రజెంటర్, మాజీ క్రికెటర్ బెన్ కటింగ్ భార్య ఎరిన్ హాలండ్ తో కలిసి మోరిసన్ మాట్లాడాడు. ఈ క్రమంలో అందరూ చూస్తుండగానే సడన్ గా ఎరిన్ హాలండ్ ను ఎత్తుకొని తన తొడపై కూర్చొ బెట్టుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు, టీవీల్లో చూస్తున్నావారు షాక్ కు గురయ్యారు. ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేసిన హాలండ్.. ''లవ్ యూ అం కుల్ @SteelyDan66''అని రాసుకొచ్చింది.