Jaggi | అబ్బాయికి లైంగిక వేధింపులు ఎదురైతే..? ఆలోచింపజేస్తున్న జగ్గీ!
30 June 2022, 20:22 IST
- జగ్గీ అనేది ఒక అవార్డ్ విన్నింగ్ మూవీ. ఇప్పటికే పలు అవార్డులను గెలుచుకుంది. మొదట ఈ సినిమాను ఒక షార్ట్ ఫిల్మ్ రూపంలో తీద్దామనుకున్నారు. అయితే విషయాన్ని మరింత అర్థవంతంగా మార్చటం కోసం స్క్రీన్‌ప్లేను పెంచాల్సి వచ్చింది, దీంతో స్టోరీబోర్డులు ఎక్కువయ్యాయి. క్రమక్రమంగా ఇది చివరకు ఫీచర్ ఫిల్మ్ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది. ఈ సినిమా కథ పంజాబ్‌లోని ఒక గ్రామీణ ప్రాంతంలో మొదలవుతుంది. కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా దీనిని రూపొందించారు. ఓ పాఠశాల విద్యార్థి బెదిరింపులు, లైంగిక వేధింపులకు గురవుతాడు. అయితే అబ్బాయి కాబట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే పరువుపోతుంది అని బయటకు చెప్పడు. ఒకవేళ ఉపాధ్యాయులు, స్నేహితుల వద్ద ప్రస్తావించినా దానిని హాస్యాస్పదంగా మార్చి నవ్వుకుంటారు. కానీ లైంగిక వేధింపులు చాలా క్రూరమైన చర్య, వర్ణించలేనంత బాధ ఉంటుంది. ఇలాంటి సీరియస్ కథను అందరికి చూపించాలనే.. తాను ఈ చిత్రం తీసినట్లు 27 ఏళ్ల అన్మోల్ సిద్ధూ వివరించారు. సిద్ధూ చాలా ఏళ్లుగా అలంకార్ థియేటర్‌లో స్టేజ్ నటుడిగా తన ప్రతిభ చాటుకొంటున్నారు. ఆయన రూపొందించిన ఈ జగ్గీ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ఇక్కడ చూడవచ్చు.