తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Shah Rukh Khan | తిరుమల ఆలయంలో భక్తులకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చిన షారుఖ్ ఖాన్

Shah Rukh Khan | తిరుమల ఆలయంలో భక్తులకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చిన షారుఖ్ ఖాన్

05 September 2023, 14:03 IST

  • బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కూతురు సుహానాఖాన్‌తో పాటు హీరోయిన్ నయనతార, డైరెక్టర్ విజ్ఞేష్ శివన్ సుప్రభాత సేవలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వేంకటేశ్వరస్వామి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనానంతరం షారూక్‌ ఖాన్‌ ఆలయం వెలుపలికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో సెల్ఫీలు తిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఇక గర్భాలయం ముందు బాలీవుడ్ బాద్షా నడుచుకుంటూ వస్తూనే చేతులతో భక్తులకు ఫ్లైయింగ్ కిస్‌లు ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. గతంలో కూడా ఇదే విధంగా ఆదిపురుష్‌లో సీత పాత్ర పోషించిన కృతిసనన్‌కి డైరెక్టర్ ఓంరౌత్‌ చెంపపై ముద్దు పెట్టడాన్ని భక్తులు తీవ్రంగా తప్పుపట్టారు.