తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Rajinikanth Temple | డై హార్ట్ ఫ్యాన్.. రజనీకాంత్‌కు ఆలయం

Rajinikanth Temple | డై హార్ట్ ఫ్యాన్.. రజనీకాంత్‌కు ఆలయం

01 November 2023, 11:48 IST

  • సినీ హీరోలు, హీరోయిన్ల కోసం అభిమానులు ఏమైనా చేస్తారు. సినీ తారల పుట్టిన రోజులు, వారి చిత్రాల రిలీజ్ రోజులను వేడుకలా చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుళ్లలా పూజిస్తారు.ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కి ఇలాంటి ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా తమిళనాడు రాష్ట్రం మదురైలో రజనీకాంత్ కు ఓ వీరాభిమాని ఏకంగా గుడి కట్టారు. 250 కిలోలతో విగ్రహాన్ని తయారు చేయించి నిత్య పూజలు చేస్తున్నారు. ఖుష్బూ, అమితాబ్ బచ్చన్, నరేంద్ర మోడీ లాంటి సెలబ్రిటీలను దేవుళ్లుగా పూజించడం మనం ఇప్పటికే చూశాం. వారికి గుడి కట్టి పూజలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఈ యువకుడు కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ విగ్రహాన్ని తయారు చేసి, అభిమానాన్ని చాటి చెప్పడానికి ప్రతిరోజూ పూజలు చేస్తున్నాడు.