తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ys Sunitha Reddy | తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా వదిలిపెట్టను

ys sunitha reddy | తన తండ్రిని ఎవరు హత్య చేశారో తెలుసుకోకుండా వదిలిపెట్టను

16 March 2023, 14:17 IST

  • తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. కానీ అసలు హంతకులు ఎవరు అన్న చిక్కుముడి వీడడం లేదు. తాజాగా ఈ కేసుపై ఆయన కుమార్తె సునీత రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో నిజాలు కచ్చితంగా బయటకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. వివేకా వర్ధంతి సందర్భంగా పులివెందులలోని ఆయన ఘాట్‌ దగ్గర నివాళులర్పించిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, తనకు తెలిసిన విషయాలన్నీ సీబీఐకి డాక్యుమెంట్లలో రూపంలో సమర్పించాను అన్నారు.