YS Sharmila : మునుగోడు ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా..? కేటీఆర్‌పై షర్మిల ఫైర్
20 October 2022, 18:45 IST
- ys sharmila fires on ktr: మంత్రి కేటీఆర్ పై వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. మునుగోడును దత్తత తీసుకోవడమేంటని...? ఇన్ని రోజులు మునుగోడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మునుగోడు ఏమైనా పాకిస్థాన్, ఆప్ఘానిస్థాన్ లో ఉందా అని నిలదీశారు. ఓట్ల కోసం దత్తత తీసుకుంటారా అని దుయ్యబట్టారు. కొండగల్ లో కూడా ఇదే తీరుగా కేటీఆర్ మాటలు చెప్పారని... కానీ అక్కడ ఏం చేయలేదని విమర్శించారు. రేపు మునుగోడులో కూడా ఇదే చేస్తారని అన్నారు.