తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Tornados In Cyclone | సుడిగాలి బీభత్సం.. ఏపీలో బెంబేలెత్తించిన టోర్నడోలు

Tornados in Cyclone | సుడిగాలి బీభత్సం.. ఏపీలో బెంబేలెత్తించిన టోర్నడోలు

06 December 2023, 11:06 IST

  • మిచౌంగ్‌ తుఫాన్‌ అన్నవరంలో బీభత్సం సృష్టించింది. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో బలమైన ఈదురుగాలులకు తోడు సుడిగాలి ప్రకంపనలు చెలరేగాయి. ఈ గాలులకు రత్నగిరి ఘాట్‌రోడ్డు రక్షణగోడ కూలిపోయింది. రత్నగిరిపై రామాలయ ప్రాంగణం వద్ద చెట్లు విరిగిపడ్డాయి. రైల్వేస్టేషన్‌ రోడ్డులో బలమైన ఈదురుగాలులకు ఆటో, వ్యాన్‌ తిరగబడింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. స్టేషన్‌రోడ్డులో రోడ్డుపై చెట్టుకొమ్మలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సుడిగాలులకు సంబంధించిన వీడియోలను అక్కడ ఉన్న స్థానికులు మెుబైల్స్ లో తీశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.