Anam Venkata Ramanareddy: మీడియాపై దాడికి పాల్పడ్డం హేయమైన చర్య.. రేపు సాక్షి పరిస్థితి ఏంటి?
20 February 2024, 13:50 IST
- ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే సాక్షి విలేకర్లపై దాడులు జరగకుండా ఉంటాయా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. గుడివాడ MLA కొడాలి నాని మాటలు చూస్తుంటే..., ఆ పరిస్థితి వచ్చేలా కనిపిస్తోందన్నారు. మీడియాపై దాడికి పాల్పడ్డం హేయమైన చర్య అన్న ఆనం, దాడికి పాల్పడిన వారిపై 307 సెక్షన్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అటు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై మాట్లాడిన ఆనం.. మీసాలు తిప్పవద్దని సలహ ఇచ్చారు. పల్నాడులో మీసాలు తిప్పితే.. కొరిగిచ్చి పంపుతారని హెచ్చరించారు.