తెలుగు న్యూస్  /  Video Gallery  /  Tdp Mlas Suspended From Ap Assembly For One Day

AP Assembly : సీఎం ఢిల్లీ టూర్ పై TDP ఆందోళన.. సభ నుంచి సభ్యుల సస్పెన్షన్

18 March 2023, 14:03 IST

  • TDP MLAs suspended From Assembly: ఏపీ అసెంబ్లీలో శనివారం గందగోళం నెలకొంది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ఆందోళనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేలు... స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ ప్రయోజనాలపై చర్చించారని చెప్పారు. చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు. సభను పక్కదారి పట్టించేందుకే టీడీపీ ప్రయత్నిస్తోందని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టగా,, స్పీకర్ ఆమోదించారు. ఫలితంగా టీడీపీ సభ్యులను ఒకరోజు సభ నుంచి దూరంగా ఉండనున్నారు.