
Lokesh Reaction on Red Book: కార్యకర్తలు, ప్రజలకు ఇచ్చిన రెడ్ బుక్ హామీ నెరవేర్చుతా
- పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రదర్శించిన రెడ్‌బుక్ సంచలనం కలిగించింది. దీనిపై సీఐడీ అధికారులు కేసు కూడా నమోదు చేశారు. విచరాణకు సైతం పిలిచారు. అయితే నాలుగో తేదీ వచ్చిన ఫలితాల్లో టీడీపీ విజయ దుందుభి మోగించింది. దీంతో ఇప్పుడు ఆ పుస్తకంలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇచ్చారు. తప్పకుండా ప్రజలు, కార్యకర్తలకు ఇచ్చి హామీను చట్టం ప్రకారం నెరవేర్చుతామన్నారు.