తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Ap High Court: చంద్రబాబుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

AP High Court: చంద్రబాబుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. క్వాష్ పిటిషన్ కొట్టివేత

22 September 2023, 14:21 IST

  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. ఆయన అభ్యర్థించిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయినప్పటికీ.. సీఐడీ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వారం క్రితం పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు..తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ క్వాష్ పిటిషన్ పై తీర్పు ఇచ్చింది.