పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్ | Prakash Raj Comments On Pawan Kalyan
25 September 2024, 8:26 IST
- హిందువుల మనోభావాలు ఎవరికీ పట్టావా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రశ్నించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడ కూడదా అని అడిగారు. సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. తాను చెప్పింది ఏంటని అడిగారు. మీరు మరోసారి తాను చెప్పింది చదవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని.. 30 తేదీ తర్వాత వచ్చి పవన్ మాటకు సమాధానం చెప్తానని వెల్లడించారు.