Sankranti Celebration | కృష్ణా జిల్లా అత్తా మజాకా.. అల్లుడి కోసం ఆతిథ్యం అదుర్స్
16 January 2024, 13:16 IST
- సంక్రాంతి అంటే పిండి వంటలు, కొత్త అల్లుడికి ఆతిథ్యాలు తప్పక ఉంటాయి. గోదావరి జిల్లాల్లో మర్యాదలకు పెట్టింది పేరు. ఇంటికి వచ్చిన కొత్త అల్లుడి కోసం రకరకాల వంటలు చేస్తారు. అయితే గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోకుండా కృష్ణా జిల్లా అల్లుడికి కూడా అదే స్థాయిలో పిండి వంటలు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఘంటసాల మండలం చిట్టూర్పుకు చెందిన గుర్రం సాయినాధ్.. తన చెల్లి నవ్య-బావను పండుగకి ఆహ్వానించారు. సాయినాధ్ బావ కాగిత రేవంత్ కొచ్చి ఐఓసీలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తారు. అల్లుడి కోసం అత్త ఏకంగా 250 రకాల పిండి వంటలు చేశారు. వారికి ప్రత్యేకంగా వడ్డించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.