తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila: ఎన్నికలు రాగానే బీసీలు గుర్తుకొచ్చారా? Kcrపై షర్మిల ఫైర్

YS Sharmila: ఎన్నికలు రాగానే బీసీలు గుర్తుకొచ్చారా? KCRపై షర్మిల ఫైర్

HT Telugu Desk HT Telugu

19 May 2023, 20:25 IST

    • YS Sharmila Fires On CM KCR:ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. ఎన్నికల దగ్గరపడుతున్న వేళ బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు.
వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల

YS Sharmila Latest News: ఎన్నికల వేళ సీఎం కేసీఆర్ బీసీలు గుర్తుకొచ్చారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శించారు. బీసీలకు లక్ష రూపాయల సాయం అందించటంపై స్పందించిన ఆమె... ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశారని... గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించారని దుయ్యబట్టారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sircilla News : రూ. 7 వేలు లంచం డిమాండ్, ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ సీనియర్ అసిస్టెంట్

ACB Raids On MRO : భూమి రిజిస్ట్రేషన్ కు లంచం డిమాండ్- ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో, ధరణి ఆపరేటర్

Hyderabad Finance Fraud : హైదరాబాద్ లో బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ, రూ.200 కోట్లు స్వాహా!

TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!

9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు వైఎస్ షర్మిల. "బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదు. ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కింది. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదు" అని షర్మిల ఆక్షేపించారు.

బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డారని షర్మిల ఆరోపించారు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె.. చేపలు పట్టుకోవాలె.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? అని ప్రశ్నించారు. ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన కేసీఆర్ కు.. 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కులవృత్తులు చేస్తున్నవారికి రూ.లక్ష వరకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాల రూపకల్పనకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. విధివిధానాలు ఖరారై, లబ్ధిదారుల ఎంపిక వేగంగా జరిగితే వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లోనే ఆయా వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

తదుపరి వ్యాసం