Sarayu Arrest| యూట్యూబర్ సరయూ అరెస్ట్.. కారణం ఏంటంటే?
08 February 2022, 11:15 IST
యూట్యూబర్ సరయూను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్ ప్రమోషన్లో హిదువుల కించపరిచేలా చేశారని.. పోలీసులకు విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేశారు.
యూట్యూబర్ సరయూ
యూట్యూబర్ సరయూతో పాటు ఆమె బృందంపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సరయూను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతోపాటు టీమ్ ను కూడా అరేస్టు చేశారు. సరయూతోపాటుగా ఆమె బృందం ‘7 ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. సిరిసిల్లలో 7 ఆర్ట్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ చేశారు. అయితే ప్రమోషన్లలో భాగంగా దానికోసం ఓ షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. గతేడాది ఫిబ్రవరి 25న తన ఛానల్‌తో పాటు సామాజిక మాధ్యమాల్లో రిలీజ్ చేశారు. అందులో సరయూ.., ఆమె బృందం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు కట్టుకున్నారు.
అయితే ఈ విడియోపై విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని, మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో పాటు మద్యం తాగి హోటల్‌కు వస్తారనే దుష్ప్రచారం అవుతోందని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేశారు. బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫిలింనగర్ లో వీడియో తీసినట్టు గుర్తించారు. కేసులు బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. ఈ మేరకు యూట్యూబర్ సరయూతోపాటు ఆమె బృందాన్ని అదుపులోకి తీసుకున్నారు.