Human Trafficking: పిల్లల్ని కొని, పెంచి వ్యభిచార దందా.. యాదాద్రిలో ముఠా అరెస్ట్
05 May 2023, 15:21 IST
- Human trafficking racket busted: గుట్టుచప్పుడు కాకుండా బాలికలతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను యాదాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నప్పుడే పిల్లలను కొనుగోలు చేసి పెంచి... ఇలా దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
యాదాద్రిలో బలవంతంగా వ్యభిచారం(represntative image)
Yadadri Police Arrested 5 Human Traffickers: పిల్లలను కొన్నది.. పెంచి పెద్ద చేసింది. యుక్త వయసు వచ్చాక.. వ్యభిచారం రొంపిలోకి దించింది ఓ మహిళ. ఇందుకోసం ఓ ముఠానే ఏర్పాటు చేసింది. వీరి బారి నుంచి ఓ బాలిక తప్పించుకోని బయటికి రావటంతో విషయమంతా బయటికి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశంతో వీరి దందాను గుట్టురట్టు అయింది. ఈ ఘటన యాదగిరిగుట్టలో వెలుగు చూసింది.
పోలీసుల వివరాల ప్రకారం... యాదగిరిగుట్ట పరిధిలోని యాదగిరిపల్లికి చెందిన కంసాని అనసూయ కొన్నేళ్ల క్రితం బాలికలను కొని పెద్దయ్యాక తన బంధువైన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి వాసి కంసాని శ్రీనివాస్ దగ్గరికి పంపించింది. వారితో అతడు వ్యభిచారం చేయించేవాడు. వీరిని అనసూయ కొట్టి, భయపెట్టి వ్యభిచారం చేయించేది. గత నెలలో ఓ బాలిక జనగామ జిల్లా కేంద్రంలో బస్టాండ్‌వద్ద విలపిస్తూ కనిపించింది. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలిక తన కుమార్తె అని.. తనకు అప్పగించాలంటూ సంరక్షణ కేంద్రం అధికారులను కంసాని అనసూయ కోరింది. దీంతో వాస్తవాల నిర్ధారణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీఓ) సైదులుకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అనసూయ చెప్పిన కొన్ని విషయాలు అనుమానస్పందగా అనిపించటంతో అధికారులు..లోతుగా వివరాలు సేకరించారు. దీంతో అసలు విషయం బయటికి వెలుగు చూసింది.
ఇద్దరు బాలికలను శిశువులుగా ఉన్నప్పుడే అనసూయ కొనుగోలు చేసింది. యుక్త వయస్సుకు వచ్చాక వారితో వ్యభిచారం చేయించాలనుకుంది. కొన్నాళ్ల క్రితం వారిద్దరిని సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన తన బంధువు కంసాని శ్రీనివాస్ ఇంటికి పంపింది. అక్కడ వారితో బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఇటీవల యాదగిరిగుట్టకు తీసుకువచ్చి వ్యభిచారం చేయించారు. అందుకు నిరాకరిస్తే కొట్టేవారు. ఈ బాధలు భరించలేక ఓ బాలిక తప్పించుకొని జనగామకు చేరింది. విచారణలో ఆమె ఈ విషయాలు వెల్లడించడంతో పోలీసులకు బాలల సంరక్షణ అధికారలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనసూయను వారు అరెస్టు చేశారు.
ఈ కేసులో కంసాని శ్రీనివాస్‌తో పాటు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన చంద్ర భాస్కర్, కంసాని లక్ష్మి, కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన చంద్ర కార్తిక్‌లను పోలీసులు అరెస్టు చేశారు. యాదగిరిగుట్టకు చెందిన కంసాని ప్రవీణ్, హుస్నాబాద్‌కు చెందిన కంసాని స్వప్న, కంసాని అశోక్, రామడుగు గ్రామానికి చెందిన చంద్ర సరోజ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులపై పలు సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు.
అంతర్జాతీయ సెక్స్ రాకెట్…
మరోవైపు సైబరాబాద్ పోలీసులు(Cyberabad Police) అంతర్జాతీయ సెక్స్ రాకెట్(Sex Racket)ను చేధించారు. డ్రగ్స్(Drugs)ను సప్లై చేస్తూ.. యువతులను, మహిళలను సెక్స్ రాకెట్లో దించుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. 15 సిటీలకుపైగా యువతులను రప్పించి.. వెబ్ సైట్, వాట్సప్, కాల్ సెంటర్లు, యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్శిస్తున్నట్టుగా తెలిసింది. యాడ్స్ ద్వారా కస్టమర్లను ఆకర్శించి.. అమ్మాయిలను సప్లై చేస్తున్నారని గుర్తించారు. ఈ దాడిలో అంతర్జాతీయ(International) ముఠాకు చెందిన 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ రాకెట్ మెుత్తం ఆన్ లైన్(Online) కేంద్రంగా నడుస్తోంది. ఈ ముఠా ఉచ్చులో ఏకంగా 14 వేల 190 మంది మహిళలు, యువతులు ఉన్నట్టుగా సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో విదేశాలకు చెందిన మహిళలు, దేశంలోని వివిధ నగరాలకు చెందిన వాళ్లూ ఉన్నారు. ప్రధానంగా.. ఏపీ, తెలంగాణ(Telangana), దిల్లీ, ముంబాయి, కోల్ కత్తా, అస్సోం, బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, ఉజ్బెకిస్థాన్, రష్యా దేశాలకు చెందిన వారు ఉన్నారని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.