తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Temple : ఆటోడ్రైవర్లకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతి

Yadadri Temple : ఆటోడ్రైవర్లకు గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత యాదాద్రి కొండపైకి ఆటోలు అనుమతి

11 February 2024, 18:52 IST

    • Yadadri Temple : యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. రెండేళ్ల తర్వాత ఆటోలను కొండపైకి అనుమతించారు అధికారులు.
  యాదాద్రి కొండపైకి ఆటోలు
యాదాద్రి కొండపైకి ఆటోలు

యాదాద్రి కొండపైకి ఆటోలు

Yadadri Temple : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించారు అధికారులు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటోలో ఎక్కించుకుని ఎమ్మెల్యే ఐలయ్య స్వయంగా కొండపైకి తీసుకెళ్లారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య...గత పాలకులు రెండేళ్లుగా ఆటో కార్మికులను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆటో కార్మికుల కోసం దొంగ ఏడుపు ఏడుస్తున్నారని విమర్శించారు. యాదాద్రి అభివృద్ధిలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిచారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి విచారణ జరిపించాలని కోరుతామన్నారు. యాదాద్రి కొండపైకి రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించడంతో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

మొదటి ఘాట్ రోడ్ లో

యాదగిరిగుట్టలో దాదాపు 500 మంది ఆటోడ్రైవర్లు బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ఆటోలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో కొండపైకి ఇప్పటి వరకూ అన్ని వాహనాలకు అనుమతి లేదు. అయితే ఎక్కువ శాతం భక్తులు ఆర్టీసీ బస్సుల్లో కొండపైకి చేరుకుంటున్నారు. సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లే భక్తులు పార్కింగ్ ఫీజులు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు నేటి నుంచి కొండపైకి మొదటి ఘాట్‌ రోడ్‌ మీదుగా ఆటోలను అనుమతిస్తున్నారు. యాదాద్రి దేవస్థానం పాత ప్రధాన కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

షిఫ్టుల వారీగా ఆటోలు

రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తాయని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్పారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుందన్నారు. షిఫ్టుకు 50 ఆటోలు చొప్పున నడుస్తాయని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. 25 ఆటోలు కొండపైన ఉంటే, మరో 25 కొండ కింద ఉంటాయని పేర్కొన్నారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు ఉండాలన్నారు. ఆటో డ్రైవర్లపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. ఆటో ఛార్జీలను డ్రైవర్లతో నిర్ణయించి చెబుతామన్నారు. అయితే ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడుపుతామని, భక్తులకు అసౌకర్యం లేకుండా రవాణా సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

2022లో కొండపైకి ఆటోలు నిషేధం

యాదగిరిగుట్ట ఆలయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఈ కారణంగా 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించారు. దీంతో అప్పట్లో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు చేశారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపు 20 నెలల పాటు ఈ దీక్షలు కొనసాగాయి. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచనతో 2023 నవంబర్‌‌‌‌లో దీక్షలు విరమించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కొండపైకి అనుమతి ఇస్తామని హామీ ఇచ్చింది.

తదుపరి వ్యాసం