HT తెలుగు మీకు నోటిఫికేషన్ పంపాలనుకుంటోంది. సబ్‌స్క్రైబ్ చేసుకోవడానికి సరే అని క్లిక్ చేయండి.
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Garibhrath Coaches: విశాఖ‌-సికింద్ర‌ాబాద్‌ గరీబ్‌ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌లో స‌రికొత్త‌ కోచ్‌లు… ఆధునిక సౌక‌ర్యాలు

Garibhrath Coaches: విశాఖ‌-సికింద్ర‌ాబాద్‌ గరీబ్‌ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌లో స‌రికొత్త‌ కోచ్‌లు… ఆధునిక సౌక‌ర్యాలు

HT Telugu Desk HT Telugu

12 July 2024, 13:18 IST

    • Garibhrath Coaches: విశాఖ‌-సికింద్ర‌బాద్‌ గరీబ్‌ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్‌కి స‌రికొత్త‌ కోచ్‌లు తీసుకురానున్నారు. అందులో ఆధునిక సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి.
గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త కోచ్‌లు
గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త కోచ్‌లు (HT_PRINT)

గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌కు సరికొత్త కోచ్‌లు

Garibhrath Coaches: ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఇండియ‌న్‌ రైల్వే సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ గరీబ్‌ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లుగా మార్చాలని నిర్ణయించిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ సీనియ‌ర్ డివిజన‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మేనేజ‌ర్ కె. సందీప్ తెలిపారు. జులై 22 నుంచి ఈ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

సికింద్రాబాద్-విశాఖపట్నం ( 12740) గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు 2024 జులై 22 నుండి అమలులోకి వచ్చేలా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో మార్చ‌నున్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ (12739) గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు 2024 జులై 23 నుండి అమలులోకి వచ్చేలా ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో మార్చ‌నున్నారు.

ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల అందుబాటులోకి తీసుకురావ‌డానికి ఇండియ‌న్‌ రైల్వే తన రోలింగ్ స్టాక్‌ను ఆధునీకరించడానికి, ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగమ‌ని సందీప్ తెలిపారు. కొత్త రేక్‌లో 18 ఎసీ (మూడో) ఎకానమీ కోచ్‌లు, రెండు జనరేటర్ మోటార్ కార్లతో సహా 20 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉంటాయి. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అత్యుత్తమ రైడింగ్ సౌకర్యం, మెరుగైన భద్రతా ఫీచర్‌లు, మెరుగైన వేగ సామర్థ్యం కారణంగా ప్రయాణ సమయం త‌గ్గుద‌ల‌కు తోర్పాడుతాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రైళ్ల‌కు పాత మోడ‌ల్ బోగిలే ఉన్నాయి. దీంతో ఈ రైళ్ల‌లోని బోగీల్లో అప్‌గ్రేడ్ చేయాల‌ని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. అందులో భాగంగానే ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బీ) కోచ్‌లుగా మార్చనున్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ (12739) గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌తి రోజు విశాఖ‌ప‌ట్నంలో రాత్రి 8ః40 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతోంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 8ః20 గంట‌ల‌కు సికింద్ర‌బాద్ చేరుకుంటుంది.

అలాగే సికింద్రాబాద్-విశాఖపట్నం ( 12740) గరీబ్ ర‌థ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు సికింద్ర‌బాద్‌లో రాత్రి 8ః30కి బ‌య‌లుదేరుతుంది. మ‌రుస‌టి రోజు ఉద‌యం 7ః40కి విశాఖ‌ప‌ట్నం చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు ఏపి, తెలంగాణ‌లోని తొమ్మిది రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి. విశాఖ‌ప‌ట్నంలో బ‌య‌లుదేరిన రైలు దువ్వాడ‌, అన‌కాప‌ల్లి, తుని, సామర్ల‌కోట‌, రాజ‌మండ్రి, ఏలూరు, విజ‌య‌వాడ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతుంది. తిరిగి ప్ర‌యాణంలో కూడా ఇవే రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతుంది.

వందేభారత్‌లో సాంకేతిక లోపం…

విశాఖపట్నం - సికింద్రాబాద్ (20833) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక స‌మ‌స్య త‌లెత్తింది. దీంతో ప్ర‌యాణికుల‌కు దాని స్థానంలో మ‌రొక ప్ర‌త్యేక రైలును వాల్తేర్ డివిజ‌న్ వేసింది. ఈ రైలు కూడా వందేభార‌త్ ఎక్స్‌ప్రెస్‌తో స‌మాన‌మైన స్టాప్‌ల‌తో అదే మార్గంలో ప్ర‌యాణిస్తుంది. ప్రత్యేక రైలు విశాఖపట్నం నుండి సికింద్రాబాద్‌కు ఉద‌యం 6:45 గంటలకు బయలుదేరింది.

డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ పర్యవేక్షణలో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అదే రైలు తిరిగి విశాఖ‌ప‌ట్నానికి చేరుకుంటుంది. ఈ రెండు స‌ర్వీసుల్లో 16 కోచ్ కోచ్‌లు ఉన్నాయి. అందులో 14 (మూడో) ఏసీ ఎకాన‌మీ కోచ్‌లు కాగా, రెండు జ‌న‌రేట‌ర్ మోట‌ర్ కార్లు ఉన్నాయి.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

HT Telugu ఫేస్‌బుక్ పేజీ ద్వారా అప్‌డేట్స్ పొందండి
తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్