తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay: స్నేహమేరా జీవితం..చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Bandi Sanjay: స్నేహమేరా జీవితం..చిన్ననాటి మిత్రులతో ఉల్లాసంగా గడిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్

Sarath chandra.B HT Telugu

05 August 2024, 7:26 IST

google News
    • Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రెండ్ షిప్ డే సందర్భంగా ఎంజాయ్ చేశారు. చిన్ననాటి స్నేహితులు, సరస్వతి శిశుమందిర్ క్లాస్ మేట్ల తో కలిసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు‌.
ఫ్రెండ్‌షిప్‌ డే రోజు స్నేహితులతో  కేంద్రమంత్రి బండి సంజయ్
ఫ్రెండ్‌షిప్‌ డే రోజు స్నేహితులతో కేంద్రమంత్రి బండి సంజయ్

ఫ్రెండ్‌షిప్‌ డే రోజు స్నేహితులతో కేంద్రమంత్రి బండి సంజయ్

Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రెండ్ షిప్ డే సందర్భంగా ఎంజాయ్ చేశారు. చిన్ననాటి స్నేహితులు, సరస్వతి శిశుమందిర్ క్లాస్ మేట్ల తో కలిసి పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు‌.

అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ కు చెందిన స్నేహితులు 35 మంది హైదరాబాద్ ఎల్బీనగర్ సమీపంలో మన్సూరాబాద్ లో బండి సంజయ్ ని కలిశారు. అనుకోకుండా వచ్చిన స్నేహితులందరినీ చూసిన బండి సంజయ్ అందరినీ పేరుపేరునా పలకరిస్తూ, పాత జ్ఝాపకాలను నెమరేసుకుంటూ సరదాగా గడిపారు. చిన్నప్పుడు చేసిన అల్లరి, దోస్తుల మధ్య జరిగిన చిన్న చిన్న గొడవలను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు.

మంజుల ఫోటోలు మంచిగరావాలే...

పుల్లూరి శ్రీనివాసరావు, బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగం మీనాకుమారి, బుట్టి మంజుల, కె.లత, పి.శ్రీదేవి, ఎం.శోభారాణి, చెన్నాడి ప్రవీణ్ రావు, తనుగుల శ్రీధర్, తోట ప్రకాశ్, నార్ల మహేందర్, పుల్లూరు శ్రీ రంగారావు, వైద్య సంజయ్, వెల్దండి వేణు మాధవ్, తాటిపల్లి శ్రీనివాస్, ముక్కా శ్రీధర్, భువనగిరి శ్రీధర్, చిటుమల్ల శ్రీనివాస్, గసిగంటి మోహన్, కామారపు నరేందర్, మేడిశెట్టి సంజయ్, చెరుకుతోట శ్రీనాథ్ రావు, రేపాల శ్రీనివాస్, శ్రీరామోజు యోగింద్రనాధ్, కాడర్ల వేణుమాధవ్ తదితరులంతా బండి సంజయ్ తో కలిసి ఫ్రెండ్ షిప్ డే రోజున ఎంజాయ్ చేశారు.

మంజుల ఫొటోలు మంచిగ రావాలే... లేకుంటే కెమెరా గుంజుకపోతది... అసలే చిన్నప్పటి నుండి టెర్రర్.. అంటూ బండి సంజయ్ స్నేహితులతో కామెంట్ చేశారు. మీరే ఫోటోలు దిగుతరా.... మాకు ఛాన్సవ్వరా? అంటూ సంజయ్... ఈ శోభ గుర్తుందా? సీరియల్ నెంబర్ 1...ఈమె తెచ్చిన చిట్టీలు కాపీ కొడుతుంటే వెంకట్ సార్ మనందరిని కొట్టిండురా గుర్తుందా?...అంటూ గుర్తు చేశారు. ఆరేయ్ శ్రీను... దూరం దూరం ఉంటవేందిరా... ఇటు రా .. అందరం కలిసి ఫోటోలు దిగుదాం... అంటూ మిత్రులతో సంజయ్ సరదాగా గడిపారు.

తన ఫ్రెండ్స్ అందరినీ పేరు పేరునా పలకరిస్తూ...ఎవరెవరు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను తెలుసుకోవడంతోపాటు వారి కుటుంబ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత అందరితో కలిసి ఫోటోలు దిగారు. తన చిన్ననాటి స్నేహితుడిని కలవడంతో వాళ్లందరి ఆనందానికి ఆవధుల్లేవు. సంజయ్ బిజీబిజీగా ఉన్నప్పటికీ అక్కడే దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. స్నేహితులంతా కలిసి ప్రత్యేకంగా తీసుకొచ్చిన కేక్ ను సంజయ్ కు తినిపించారు. తిరిగి పయనమయ్యేటప్పుడు సైతం సంజయ్ ను కలిసి మళ్లీ కలుద్దాం... ఈసారి ఏదైనా ఈవెంట్ పెట్టుకుందామని చెబుతూ వెళ్లిపోయారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం