తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ujjaini Bonalu : పూజలు సరిగా జరగడం లేదని “రంగం”లో అమ్మవారి ఆగ్రహం

Ujjaini Bonalu : పూజలు సరిగా జరగడం లేదని “రంగం”లో అమ్మవారి ఆగ్రహం

HT Telugu Desk HT Telugu

18 July 2022, 11:44 IST

google News
    • సికింద్రబాద్‌లో ఉజ్జయిని మహంకాళీ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.  తెల్లజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. మరోవైపు బోనాల సందర్భంగా నిర్వహించే రంగం కార్యక్రమంలో  జోగిని స్వర్ణలత ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనకు పూజలు సరిగా జరగడం లేదని,  తన రూపాన్ని ఇష్టానుసారం మార్చేస్తున్నారని మండిపడ్డారు. 
సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు (twitter)

సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు

సికింద్రబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా నిర్వహించిన "రంగం"లో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. తనకు పూజలు మొక్కుబడిగా చేస్తున్నారని, తనకు చేసే పూజలు , చేసే వారి సంతోషం కోసమే తప్ప తన కోసం కాదన్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు మొక్కుబడి చేస్తున్నారని, ఎంత సంతోషంగా చేస్తున్నారో గుండెల మీద చేతులేసుకుని చెప్పాలని ప్రశ్నించారు. భక్తులు పూజల్ని సంతోషంగా చేస్తున్నారనే తాను స్వీకరిస్తున్నానని, అయితే గుడిలో పూజలు సరిగా జరగడం లేదని స్వర్ణలత రంగం కార్యక్రమంలో చెప్పారు.

గర్భాలయంలో మొక్కుబడి పూజలు వద్దని, శాస్త్రబద్దంగా పూజలు చేయాలన్నారు. మొక్కుబడి పూజలు చేస్తున్నా తనబిడ్డలే కదా అని భరిస్తున్నానన్నారు. గుళ్లో తనను ఎన్ని రూపాల్లోకి తనను మారుస్తారని, మీకు నచ్చినట్టు మార్చేస్తున్నారని, స్థిరమైన రూపంలో కొలువుదీరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తన రూపాన్ని స్థిరంగా ఉంచాలని, తనకు ఎవరేమి చేయాల్సిన అవసరం లేదని, అంతా తాను తెచ్చుకున్నదే అన్నారు. దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారని భవిష్యవాణిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలని, తన రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చొద్దని, రూపాన్ని స్థిరంగా ఉంచాలని భవిష్యవాణిలో సూచించారు. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలని చెప్పారు.. తనకు పూజలు సరిగ్గా చేయనందుకే కుండపోత వర్షాలు కురిపిస్తున్నానని, మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నానన్నారు. ఎన్ని తప్పులు చేసినా తన బిడ్డలేనని క్షమిస్తున్నానని భవిష్యవాణిలో చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం