తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Extra Marital Affair: టీచరమ్మతో మరో టీచర్ ఎఫైర్... రెడ్‌ హ్యాండెడ్‌గా భర్తకు ఇలా దొరికిపోయారు

Extra Marital Affair: టీచరమ్మతో మరో టీచర్ ఎఫైర్... రెడ్‌ హ్యాండెడ్‌గా భర్తకు ఇలా దొరికిపోయారు

HT Telugu Desk HT Telugu

22 February 2023, 17:12 IST

google News
    • Mulugu District Crime News:  వివాహేతర సంబంధం పెటుకున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు భర్త. మాటు వేసి ఇద్దర్నీ కట్టేశాడు… వారిని పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లాడు. ఈ  ఘటన ములుగు జిల్లా పరిధిలో వెలుగు చూసింది.
టీచరమ్మతో మరో టీచర్ ఎఫైర్
టీచరమ్మతో మరో టీచర్ ఎఫైర్

టీచరమ్మతో మరో టీచర్ ఎఫైర్

Two govt teachers caught: భార్య ప్రభుత్వ టీచర్... భర్త కానిస్టేబుల్..! వీరికి ఓ కుమార్తె..! సాఫీగా సాగుతున్న జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పచ్చని సంసారంలో నిప్పులు పోసినట్లు అయింది. ఏకంగా మాటు వేసి... భార్యతో పాటు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకున్నాడు భర్త. ఇద్దర్నీ కట్టేసి నడి రోడ్డుపై తీసుకువచ్చాడు. విషయం కాస్త పోలీసు స్టేషన్  వరకు  చేరింది. ఈ ఘటన ములుగు జిల్లా పరిధిలో వెలుగు చూసింది. వివరాలు చూస్తే.......

మంగపేట మండల పరిధిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలోని ఇద్దరి ఉపాధ్యాయుల మధ్య గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం కాస్త పక్కా జిల్లాలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న భర్త దృష్టికి కూడా చేరింది. కూతురితో అద్దె ఇంట్లో ఉంటున్న భార్య... మరో ఉపాధ్యాయుడు నాగేందర్‌ మధ్య సాగుతున్న వివాహేతర సంబంధం గురించి లోతుగా ఆరా తీశాడు.ఇదే విషయంపై భర్యను గట్టిగా హెచ్చరించాడు. పలుమార్లు వీరిమధ్య గొడవలు కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా... ఆమెను మరో పాఠశాలకు కూడా బదిలీ చేశారు అధికారులు. అయినప్పటికీ భార్య తీరు మారలేదు. వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తూనే వచ్చింది.

ఫోన్ లిఫ్ట్ చేయటంతో......

ఈ నెల 18వ తేదీన బందోబస్తు డ్యూటీపై వెళ్లిన భర్త... సోమవారం సెలవు రావటంతో భార్య ఉంటున్న మంగపేటకు వెళ్లాడు. ఇదే సమయంలో అర్ధరాత్రి  టైంలో  భార్యకు ఫోన్ వచ్చింది. వెంటనే ఆ ఫోన్ కాల్ ను భర్త లిఫ్ట్ చేశాడు. ‘నేను ఇంటికి వస్తున్నా తలుపు తీసి ఉంచు’అని నాగేందర్ చెప్పాడు. ప్రత్యక్షంగా ఫోన్ కాల్ విన్న భర్త.... సరిగ్గా అదే సమయానికి తలుపు తీసి బాత్‌రూంలో దాక్కున్నాడు. నాగేందర్‌ ఇంట్లోకి రాగానే ఇంటి తలుపులు మూసివేసి గడియ పెట్టాడు. అతని పట్టుకొని ప్రశ్నించటం మొదలుపెట్టాడు. ఇక బయటికి వచ్చిన భర్త... బంధువులను తీసుకొని వచ్చి ఉదయం వారిద్దరిని బంధించాడు. తాళ్లతో కట్టి రోడ్డుపైకి తీసుకువచ్చాడు. ఇద్దరిని కూడా పోలీసులకు అప్పగించాడు. పోలీసులు వీరికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిసింది.

తదుపరి వ్యాసం