TSRTC: ఉప్పల్ - యాదాద్రి మధ్య 100 మినీ బస్సులు.. ఛార్జీల వివరాలు ఇవే
30 March 2022, 14:46 IST
- యాదాద్రి పునఃప్రారంభమైంది. భక్తులు పోటెత్తుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన ఛార్జీలను వెల్లడించారు.
ఉప్పల్ నుంచి 100 మినీబస్సులు
ప్రముఖ దివ్యక్షేత్రం యాదగిరిగుట్టకు హైదరాబాద్ నుంచి వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా 100 మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ సర్కిల్ నుంచి యాదాద్రి మధ్య రవాణా సర్వీసులు అందజేస్తాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
ఛార్జీలు ఇవే....
మినీ బస్సు సర్వీలసు సంబంధించి ఛార్జీలను ప్రకటించారు ఆర్టీసీ ఎండీ. జేబీఎస్ నుంచి యాదగిరిగుట్టకు రూ.100 ... ఉప్పల్ నుంచి అయితే రూ. 75 గా నిర్ణయించారు. ఇతర జిల్లాల కేంద్రాల నుంచి బస్సు సర్వీసులు యాదాద్రికి ఉన్నాయని చెప్పారు.
ఈనెల 28న సాయంత్రం యాదాద్రి శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాదాద్రికి భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు కొండ కింద ఉన్న లక్ష్మీపుష్కరిణిలో... పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కల్యాణకట్ట సముదాయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా... ఉచిత దర్శనం టోకెన్లను అందిస్తున్నారు. ఇందుకోసం ట్రయల్‌రన్ నిర్వహిస్తున్నారు. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని సర్వ దర్శనం టోకెన్ అందిస్తున్నారు.
టాపిక్