TSRTC | మహాశివరాత్రికి తీర్థాలకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్
27 February 2022, 13:28 IST
- మహాశివరాత్రికి శైవ క్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంటి వద్దకే బస్సు పంపేలా ఏర్పాటు చేసింది.
మహాశివరాత్రికి టీఎస్ఆర్టీ బస్సులు
మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని.. శైవ క్షేత్రాలకు వెళ్లాలనుకునే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఒకవేళ క్షేత్రానికి వెళ్లాలనుకుని 30 మంది ప్రయాణికులు ఉంటే వారి ఇంటి వద్దకే బస్సు పంపనుంది. శైవక్షేత్రాలు, పుణ్యతీర్థాలకు వెళ్లాలనుకునే భక్తులు 30 మంది బృందంగా ఏర్పడిన వారికైనా, కాలనీలో ఉండేవారు కలిసి వెళ్లాలనుకొన్నా ఆర్టీసీని సంప్రదిస్తే.. సరిపోతుంది. ఈ మేరకు అవసరం ఉన్న వారు ఫోన్ చేయాల్సిందిగా..టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. బస్సు కావాలనుకునేవారు.. ఆర్టీసీ డిపో మేనేజర్ ను సంపదించొచ్చని.. లేదా 040-30102 829, 040-68153333 ఫోన్ చేసైనా.. చెప్పొచ్చని తెలిపారు.
నిత్యం ఏదో ఒక చోటుకి ప్రయాణం చేసే వారికోసం కూడా ఇటీవలే టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు ఆ సంస్థ ఎండీ ఇటీవలే ప్రకటించారు. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ప్రయాణించేవారికి.. మంత్రి సెషన్ టికెట్స్(ఎంఎస్టీ) విధానాన్ని తీసుకొచ్చారు. దీనిద్వారా.. ప్రతీ ప్రయాణంలో 33 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
ఆర్డీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు వేస్తూ ముందుకెళ్తున్నారు. పండుగలు, వేడుకల్లో ప్రజలను ఆకర్షించే విధంగా ప్రయత్నిస్తూ సంస్థను లాభాల బాటల్లోకి వెళ్లేలా చేస్తున్నారు. అంతేకాదు.. సంస్థను ప్రమోట్ చేసేందుకు మీమ్స్ ను కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవలే మహిళా ప్రయాణికుల కోసం సైతం.. కీలక నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టైతే.. క్యూఆర్ స్కాన్ చేసేందుకు.. టెక్నాలజీని ఏర్పాటు చేశారు. దానికోసం క్యూఆర్ కోడ్ ను కూడా సిద్ధం చేశారు.
ప్రయాణికులు, సొంత సిబ్బంది సైతం.. ఆర్టీసీకి సంబంధించి ఫిర్యాదులను, సూచనలను నేరుగా తన దృష్టికి తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీపై నమ్మకం కలిగేలా అడుగులు వేస్తున్నారు సజ్జనార్. md@tsrtc.telangana.gov.in మెయిల్ ఐడీలో కానీ, @tsrtcmdoffice ట్విట్టర్ ఖాతా ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తారు.
మహా శివరాత్రి పర్వదినం.. సందర్భంగా.. టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేలా ప్రణాళికలు చేసింది. మార్చి 4వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ఉండనున్నాయి. మహా శివరాత్రికి అత్యంత రద్దీ ఉండే కీసర గుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. అల్వాల, అమ్మూగూడా, బాలా నగర్ క్రాస్ రోడ్డు, మియాపూర్ క్రాస్ రోడ్డు, పటాన్ చెరువుతోపాటుగా.. ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నారు.
టాపిక్