తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Independence Day Offer: ఆ రోజే పుడితే ఫ్రీ బస్ జర్నీ.. టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌

TSRTC independence day offer: ఆ రోజే పుడితే ఫ్రీ బస్ జర్నీ.. టీఎస్‌ఆర్టీసీ ఆఫర్‌

B.S.Chandra HT Telugu

09 August 2022, 9:00 IST

google News
    • TSRTC independence day offer: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ పుట్టిన వారికి టిఎస్‌ఆర్టీసి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగష్టు 15న జన్మించిన వారికి 12ఏళ్ల వయసు వచ్చే వరకు  ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు.
టిఎస్‌ఆర్టీసీ ఇండిపెండెన్స్‌ డే ఆఫర్
టిఎస్‌ఆర్టీసీ ఇండిపెండెన్స్‌ డే ఆఫర్

టిఎస్‌ఆర్టీసీ ఇండిపెండెన్స్‌ డే ఆఫర్

TSRTC independence day offer: అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉత్సవాల నిర్వహణలో భాగంగా 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు టిఎస్‌ఆర్టీసి ఏర్పాటు చేసింది. ఆగష్టు 15న పుట్టిన చిన్నారులకు 12ఏళ్లు వచ్చే వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. అంటే 2022ఆగష్టు 15న పుట్టిన పిల్లలు 2034వరకు ఉచితంగా టిఎస్‌ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఉచిత ప్రయాణం సిటీ సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న సిటీ బస్సుల్లో 12ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు.

TSRTC independence day offer: దీంతో పాటు 75ఏళ్లు పూర్తి చేసుకున్న వృద్ధులు ఆగష్టు 15న ఉచితంగా గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు అనుమతిస్తారు. టీ -24 పేరుతో ఆర్టీసి విక్రయిస్తున్న రూ.120 రుపాయల టిక్కెట్‌ను రూ.75కే విక్రయించనున్నారు. ఆగష్టు 10 నుంచి 21 వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఆర్టీసి నిర్వహించనుంది. మంగళవారం నుంచి ఆర్టీసి ప్రాంగణాల్లో ఉదయం 11గంటలకు జాతీయ గీతాలాపన చేస్తారు. ఆగష్టు 13 నుంచి 15వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులకు అమృతోత్సవ్ బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఆదేశించారు.

TSRTC independence day offer: అజాదీకా అమృత్‌ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసి బస్సుల్లో తిరుమలకు ప్రయాణించే భక్తులకు రూ75 రాయితీ ఇవ్వనున్నారు. ఆగష్టు 16-21 మధ్య ఇది వర్తిస్తుంది. కార్గో పార్సిల్స్‌ పంపే వారికి 75 కిలోమీటర్ల వరకు ఉచితంగా పార్సిల్ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగష్టు 15న మాత్రమే ఇది వర్తిస్తుంది. టాప్‌ 75 ప్రయాణికుల్లో ఒకరికి ఉచిత ట్రిప్ టిక్కెట్ బహుమతిగా ఇస్తారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి పుష్పక్ సర్వీసుల్లో ప్రయాణించే వారు 75శాతం టిక్కెట్ ధర చెల్లిస్తే సరిపోతుంది. 75ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఆగష్టు 15-22మధ‌్య కాలంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 75ఏళ్లలోపు వారికి రూ.750 రుపాయలకే వైద్య పరీక్షలు చేస్తారు.

తదుపరి వ్యాసం