తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Dasara Lucky Draw : ఇవాళ్టి నుంచే తెలంగాణ ఆర్టీసీ దసరా లక్కీ డ్రా.... రూ.11 లక్షల నగదు బహుమతులు

TSRTC Dasara Lucky Draw : ఇవాళ్టి నుంచే తెలంగాణ ఆర్టీసీ దసరా లక్కీ డ్రా.... రూ.11 లక్షల నగదు బహుమతులు

18 October 2023, 12:08 IST

google News
    • TSRTC Dasara Lucky Draw : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను సంస్థ అందిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది
తెలంగాణ ఆర్టీసీ లక్కీ డ్రా
తెలంగాణ ఆర్టీసీ లక్కీ డ్రా

తెలంగాణ ఆర్టీసీ లక్కీ డ్రా

TSRTC Dasara Lucky Draw 2023 : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా ఇవాళ్టి (అక్టోబరు 18) నుంచి ప్రారంభమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు… వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో ప్రయాణికులు వేయాలి.

బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపిక చేస్తారు. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బ‌హుమ‌తులను సంస్థ అందించనుంది. ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని మరియు సంస్థను ఆదరించాలని కోరుతోంది టీఎస్ఆర్టీసీ.

ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ఆయా తేదీల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. బస్టాండ్లు, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో పురుష, మహిళలకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనుంది. లక్కీ డ్రా అనంతరం డ్రాప్ బాక్స్ లను సంబంధిత ఆర్ఎం కార్యాలయాలకు చేర్చి ప్రతీ రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను ఎంపికచేస్తారు. మొత్తం 11 రీజియన్ లలో కలిపి 110 విజేతలను ఎంపిక చేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులను అందజేస్తారు.

జేబీఎస్ మీదుగా విజయవాడకు 24 సర్వీసులు

ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి.

అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే ఛార్జీలుంటాయన్నారు. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in ను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రస్తుతం బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటిగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక , హబ్సిగుడా, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ప్రయాణికులను కోరింది.

తదుపరి వ్యాసం