TSPSC: 'ఓటీఆర్ ఎడిట్'ను లైట్ గా తీసుకోకండి.. వెంటనే పూర్తి చేసేయండి
07 May 2022, 18:41 IST
- TSPSC One Time Registration:త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. అయితే కొత్త అభ్యర్థులు ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో చేసుకున్నవాళ్లు తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంది.
టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ఓటీఆర్ తప్పనిసరి
TSPSC One Time Registration: ఓటీఆర్... టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ఇదీ తప్పనిసరి. కొత్తగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసే వారు ఈ ఓటీఆర్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక గతంలో ఓటీఆర్ జనరేట్ చేసుకున్న వాళ్లు... ఇప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడిట్ చేసుకోకపోతే.. ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చాలా మంది అప్డేట్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు...
గ్రూపు ఉద్యోగాలకు అప్లయ్ చేయాలనుకునే వారు తప్పనిసరిగా ఓటీఆర్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మెజార్టీ అభ్యర్థులు ఓటీఆర్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్తగా ఓటీఆర్ నమోదు సంగతి అటుంచితే... ఇక గతంలో నమోదు చేసుకున్న అభ్యర్థులు నూతన జోనల్ విధానానికి అనుగుణంగా సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈమేరకు అధికారిక వెబ్ సైట్ లో కూడా పలు మార్పులు చేశారు.
కొత్త జోనల్ విధానం. ఎడిట్ తప్పనిసరి
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జోనల్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దీని ప్రకారం.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కువ కాలం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా పరిగణిస్తారు. ఈక్రమంలో ఇదివరకు ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులంతా ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వివరాలను అప్‌లోడ్ చేయాల్సిందే. అప్పుడే ఓటీఆర్ ప్రక్రియ అప్డేట్ అవుతుంది. ఇంకా ఎడిట్ చేసుకోవాల్సిన అభ్యర్థులు 23.5 లక్షలున్నట్లు తెలుస్తోంది. నమోదుతో పాటు ఎడిట్ ప్రక్రియ పూర్తి అయితే.. కమిషన్ ఇచ్చే ఉద్యోగ ప్రకటనల సమాచారం మొబైల్ నెంబర్ కు సందేశాల రూపంలో వస్తాయి.
నోట్:
*ఈ లింక్ క్లిక్ చేసి కొత్తగా ఓటీఆర్(One Time Registration) నమోదు చేయవచ్చు.
- ఈ లింక్ క్లిక్ చేసి ఓటీఆర్ ఎడిట్(Edit One Time Registration) చేసుకోవచ్చు.
టాపిక్