తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Group-3 : తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ల సవరణకు అవకాశం

TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ల సవరణకు అవకాశం

14 August 2023, 22:22 IST

google News
    • TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21 వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు.
టీఎస్పీఎస్సీ గ్రూప్-3
టీఎస్పీఎస్సీ గ్రూప్-3

టీఎస్పీఎస్సీ గ్రూప్-3

TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తుల్లో సవరణలకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకోడానికి అవకాశం కల్పించింది. గత ఏడాది డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ తొలి గ్రూప్-3 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.అక్టోబ‌ర్‌లో గ్రూప్-3 ప‌రీక్షలు నిర్వహించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. వివిధ శాఖల్లో గ్రూప్‌-3 కేటగిరీలో 1,375 ఉద్యోగాల భర్తీకి గతేడాది డిసెంబర్‌ లో నోటిఫికేషన్‌ విడుదలైంది. మరో 13 ఉద్యోగాలను జతచేస్తూ ఈ ఏడాది జూన్ లో టీఎస్పీఎస్సీ ప్రకటన జారీచేసింది. ఇరిగేషన్‌ విభాగం, ఐ అండ్‌ కాడ్‌లో కొత్తగా మరో 13 ఉద్యోగాలను జతచేసింది. కొత్తగా యాడ్ చేసిన ఉద్యోగాలతో కలిపితే మొత్తం గ్రూప్‌-3 ఉద్యోగాలు 1388కు చేరాయి. గ్రూప్ 3 పోస్టులకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరించారు.

అక్టోబర్ లో ఎగ్జామ్?

గతేడాది డిసెంబర్‌లో గ్రూప్‌-3 నోటిఫికేషన్ జారీ చేసింది టీఎస్పీఎస్సీ. ఇందులో భాగంగా 1,375కి ఉద్యోగాలను భర్తీ చేయనుంది. 5,36,477 మంది అప్లై చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు. కీలకమైన పరీక్షలను నిర్వహిస్తూ వస్తున్న కమిషన్... గ్రూప్-3 తేదీలను కూడా ప్రకటించాలని భావిస్తోంది. అన్ని కుదిరితే అక్టోబర్‌ రెండో వారంలో లేదా మూడో వారంలో నిర్వహించాలని చూస్తోంది. దీనిపై త్వరలోనే కమిషన్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మొత్తం 3 పేపర్లు, 450 మార్కులు

గ్రూప్-3 పరీక్షలో మొత్తంగా మూడు పేపర్లు ఉండనున్నాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ఈ సిలబస్ ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది టీఎస్పీఎస్సీ. గ్రూప్‌-3 పోస్టులకు పోటీపడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇంటర్వ్యూ ఉండదు. రాత పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్‌, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

తదుపరి వ్యాసం