తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 : నవంబర్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు! టీఎస్‌పీఎస్సీ కసరత్తు

TSPSC Group 1 : నవంబర్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు! టీఎస్‌పీఎస్సీ కసరత్తు

23 June 2023, 13:47 IST

google News
    • TSPSC Group 1 Mains: గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు త్వరలోనే రానున్నాయి. అయితే మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
నవంబరులో గ్రూప్ -1 మెయిన్స్!
నవంబరులో గ్రూప్ -1 మెయిన్స్!

నవంబరులో గ్రూప్ -1 మెయిన్స్!

TSPSC Latest News: పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన పరీక్షల విషయంలో వేగం పెంచింది తెలంగాణ పబ్లిక్ సర్వీక్ కమిషన్. ఇప్పటికే పలు పరీక్షలకు కొత్త తేదీలు ప్రకటించగా... కొన్నింటిని నిర్వహించింది. ఎంతో కీలకమైన గ్రూప్ - 1 పరీక్ష రద్దు కాగా.... మళ్లీ ప్రిలిమ్స్ నిర్వహించారు. రేపోమాపో ప్రాథమిక కీ ని విడుదల చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. ఇదే సమయంలో.... తుది ఫలితాలను ఇవ్వటం, మెయిన్స్ పరీక్షల తేదీలపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపోమాపో ప్రిలిమ్స్ 'కీ'

రేపోమాపో ప్రిలిమ్స్ కీ వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా కమిషన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష జరగ్గా.... ఇప్పటికే ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మెయిన్స్ పరీక్షలపై కూడా దృష్టి పెట్టింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. నవంబర్‌లో పరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి... తాజాగా భేటీ అయిన కమిషన్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు, మెయిన్స్‌ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ వారంలోనే కీ విడుదల చేయటం కాకుండా... అభ్యంతరాలను కూడా స్వీకరించేందుకు కొంత గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఫలితాలు రానున్నాయి.

తదుపరి వ్యాసం