తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Jobs 2024 : తెలంగాణ ఈఆర్‌సీలో కొలువులు - డిగ్రీ, టెన్త్ అర్హతతోనే భర్తీ, అప్లికేషన్ లింక్ ఇదే

TS Govt Jobs 2024 : తెలంగాణ ఈఆర్‌సీలో కొలువులు - డిగ్రీ, టెన్త్ అర్హతతోనే భర్తీ, అప్లికేషన్ లింక్ ఇదే

09 March 2024, 11:13 IST

    • TSERC Recruitment 2024: ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(TSERC) నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా పలు పోస్టులను భర్తీ చేయనుంది.  ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాలు

తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలిలో ఉద్యోగాలు

TSERC Recruitment 2024 Updates: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(Telangana State Electricity Regulatory Commission) ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చింది. ఇందులో భాగంగా కమిషన్ లో ఖాళీగా ఉన్న జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్లు, అకౌంట్ ఆఫీసర్, క్యాషియర్, లైబ్రేరియన్, స్టేనో కమ్ ఆపరేట్, పర్సనల్ అసిస్టెంట్ తో పాటు రిసెప్షనిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 1,2024వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. https://tserc.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(TSERC)

ఉద్యోగ ఖాళీల వివరాలు :

  • జాయింట్ డైరెక్టర్ (ఇంజినీరింగ్)-1,
  • డిప్యూటీ డైరెక్టర్లు – 10
  • అకౌంట్స్ ఆఫీసర్ – 01
  • క్యాషియర్ – 01
  • లైబ్రేరియన్ -01,
  • స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -01
  • క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ -04
  • పర్సనల్ అసిస్టెంట్ – 02
  • రిసెప్షనిస్ట్ – 01
  • ఆఫీస్ సబార్డినేట్ -05 ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హతలు - పలు పోస్టులకు డిగ్రీ లేదా ఇంజినీరింగ్ క్వాలిఫికేషన్ త ఉండాలి. కొన్ని పోస్టులకు ఇంటర్, పదో తరగతి అర్హత సరిపోతుంది. పని అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి - 45 సంవత్సరాల ఏళ్ల లోపు ఉండాలి.

పోస్టును బట్టి జీతాలు ఉన్నాయి. నోటిఫికేషన్ లో ఈ వివరాలను చూడొచ్చు.

దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్

దరఖాస్తు ఫీజు - ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగాతవారు ఒక్కో దరఖాస్తుకు రూ.120 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ - ఏప్రిల్ 01, 2024.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా - కమిషన్ సెక్రటరి, డోర్ నంబర్ 11-4-660, 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004

అధికారిక వెెబ్ సైట్ - https://tserc.gov.in/

 

హైదరాబాద్‌ MSMEలో ఉద్యోగ ఖాళీలు

MSME Hyderabad Recruitment 2024:హైదరాబాద్‌ ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ(Ministry of Micro, Small and Medium Enterprises)లో పలు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఇందులో డైరెక్టర్, ఫ్యాకల్టీ మెంబర్ పోస్టులతో అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని కలిపి 12 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా… మార్చి 29వ తేదీతో గడువు ముగియనుంది. https://www.nimsme.org/careers లింక్ తో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - ఎన్‌ఐఎమ్ఎస్‌ఎమ్‌ఈ, హైదరాబాద్

ఉద్యోగ ఖాళీలు -12

ఖాళీల వివరాలు - డైరెక్టర్ 03,

ఫ్యాకల్టీ మెంబర్ - 06

అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ -02

అసిస్టెంట్ రిజిస్ట్రార్ - 01.

అర్హతలు - మాస్టర్ డిగ్రీతో పాటు అనుభవం తప్పనిసరి. నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను చూడొచ్చు.

వయోపరిమితి - 35 ఏళ్లు మించరాదు

దరఖాస్తులు - ఆన్ లైన్

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ - మార్చి 29, 2024

అధికారిక వెబ్ సైట్ - https://www.nimsme.org/

ఆన్ లైన్ దరఖాస్తుల లింక్ - https://www.nimsme.org/careers

తదుపరి వ్యాసం