తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chalo Hyderabad : ఆగస్టు 12న సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగులు చలో హైదరాబాద్- హైకోర్టు ఉద్యోగుల మద్దతు

Chalo Hyderabad : ఆగస్టు 12న సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగులు చలో హైదరాబాద్- హైకోర్టు ఉద్యోగుల మద్దతు

05 August 2023, 21:44 IST

google News
    • Chalo Hyderabad : సీపీఎస్ రద్దు కోరుతూ టీఎస్సీపీఎస్ఈయూ ఆగస్టు 12న చేపట్టిన చలో హైదరాబాద్ కు హైకోర్టు ఉద్యోగులు మద్దతు తెలిపారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలు చేయాలని ఆగస్టు 12న రాష్ట్రంలోని 3.30 లక్షల సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నారు.
టీఎస్ సీపీఎస్ఈ యూనియన్
టీఎస్ సీపీఎస్ఈ యూనియన్

టీఎస్ సీపీఎస్ఈ యూనియన్

Chalo Hyderabad : సీపీఎస్ రద్దు డిమాండ్ చేస్తూ ఉద్యోగులు చేపట్టిన చలో హైదరాబాద్ కు హై కోర్టు ఉద్యోగులు మద్దతు తెలిపారు. హైకోర్టు ఉద్యోగులతో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణపై సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీయస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ... ఇటీవల 16 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల గుండా పాత పెన్షన్ సాధన సంకల్ప రథ యాత్రతో రాష్ట్రంలోని సీపీయస్, ఓపీయస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఏకమై ఒకే ఒక అంశం సీపీయస్ రద్దు పాత పెన్షన్ పునరుద్ధరణ కల్పించాలని 'అభి నహితో కబీ నహి నినాదం'తో ఏకమైయ్యారన్నారు. అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతుతో...కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని ఆగస్టు 12న రాష్ట్రంలోని 3.30 లక్షల సీపీఎస్, ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని స్థిత ప్రజ్ఞ తెలిపారు. దీనికి హై కోర్టు ఎంప్లాయిస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలిపింది. వారంతా చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.

ఆసరా పెన్షన్ కన్నా తక్కువ

ఈ కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ... డి.ఎస్ నకరా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 17 డిసెంబర్ 1982లో వెలువడిన తీర్పులో అత్యున్నత న్యాయస్థానం పింఛన్ అనేది ఉద్యోగి విశ్వాసంగా చేసిన సేవలకు కంపెన్షన్ మాత్రమే కాదు. పింఛను చెల్లింపులో సామాజిక ఆర్థిక న్యాయం, వృద్ధాప్య భద్రత ఉన్నాయని తెలిపిందన్నారు. శరీరంలో శక్తి తగ్గి, నిస్సహాయక స్థితిలో ఉన్న వారికి ఆసరా అని నకరా కేసు తీర్పును గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీపీఎస్ ను రద్దు చేసే తొలిరాష్ట్రంగా తెలంగాణ కావాలని స్థితప్రజ్ఞ అన్నారు. ఇదివరకే రాజస్థాన్ ఛత్తీస్ గడ్, జార్ఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో సీపీయస్ ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేశారన్నారు. ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చాయని ఇక చేయాల్సింది తెలంగాణ రాష్ట్రమే అని స్థిత ప్రజ్ఞ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గ్రాట్యూటీ ఫ్యామిలీ పెన్షన్ కల్పించిందని స్థితప్రజ్ఞ తెలిపారు. కానీ ఇప్పటివరకు రిటైర్మెంట్ అయినా సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కేవలం రూ.600 నుంచి రెండు వేల వరకు మాత్రమే సర్వీస్ పెన్షన్ పొందుతున్నారన్నారు. 30 సంవత్సరాలు ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేసే వారికి ఆసరా పెన్షన్ కన్నా తక్కువ సర్వీస్ పెన్షన్ సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పొందుతున్నారన్నారు.

తదుపరి వ్యాసం