TS inter supplementary results 2022: టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
30 August 2022, 11:40 IST
- TS inter supplementary results 2022: తెలంగాణ ఇంటర్ 2వ సంవత్సరం ఫలితాలు tsbie.cgg.gov.in, results.cgg.gov.inలో విడుదలయ్యాయి.
TS inter supplementary results 2022: టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల
TS inter supplementary results 2022: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఇంటర్మీడియట్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ప్రకటించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.inకి వెళ్లి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆగస్టు 1 నుండి 10, 2022 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించింది. తాజాగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ ఫలితాలను మాత్రమే ప్రకటించింది. ఫస్టియర్ పరీక్ష ఫలితాలు ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు EAMCET కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా సెకండియర్ రిజల్ట్స్ ప్రకటించింది.
గతంలో తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్ పరీక్ష సాధారణ ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం ఉత్తీర్ణత శాతం 67.16 శాతంగా నమోదైంది.
టీఎస్ ఇంటర్ రెండో సంవత్సరం రెగ్యులర్ పరీక్షకు మొత్తం 4,42,895 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,97,458 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
కాగా తాజాగా ఇంటర్ సెకెండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఫలితాల్లో జనరల్ అభ్యర్థులు 47.74% , ఓకేషనల్ అభ్యర్థులు 65.07% మంది ఉత్తీర్ణులయ్యారు.
ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలు 53.59 శాతం ఉండగా, బాలురు 44.43% మంది ఉన్నారు.
ఉత్తీర్ణత శాతంలో ములుగు జిల్లా మొదటి స్థానం సాధించగా, వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్ కోసం సెప్టెంబర్ 5 నుండి 8 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.
టాపిక్