తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukulam Jobs : అలర్ట్... ఆగస్ట్‌ 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు

TS Gurukulam Jobs : అలర్ట్... ఆగస్ట్‌ 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు

16 June 2023, 9:12 IST

google News
    • TS Gurukulam Exams: గురుకుల ఉద్యోగ అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఆగస్టు 1వ తేదీ నుంచి నియామక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
ఆగస్ట్‌ 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు
ఆగస్ట్‌ 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు

ఆగస్ట్‌ 1 నుంచి గురుకుల నియామక పరీక్షలు

Telangana Gurukul Recruitment: తెలంగాణలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఆగస్టు 1 నుంచి 23 తేదీ వరకు గురుకుల నియామక పరీక్ష నిర్వహించనున్నట్టు గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపింది. ఈ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు తెలిపింది. మొత్తం 9 నోటిఫికేషన్ల ద్వారా... 9వేల పైచీలుకు పోస్టులను భర్తీ చేయనున్నారు.

గురుకులాల్లో బోధనా, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. 2.63లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. మే 27వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది.

గురుకులాల్లో భర్తీ చేసే పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

సీబీఆర్‌టీ విధానంలో పరీక్షలు…

రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్‌టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. సబ్జెక్టుల వారీగా దరఖాస్తులు 35వేల లోపు ఉంటేనే సీబీటీ విధానంలో నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పేపర్లు లీక్ కావటంతో ఉద్యోగాల భర్తీ విషయంపై ప్రభుత్వం సీరియస్ గా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే గురుకుల ఉద్యోగాల విషయంలోనూ ఇలాంటి వాటికి అవకాశం లేకుండా చూడాలని భావిస్తోంది. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు అవసరమైతే షిఫ్టుల విధానంలో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించాలని ఆలోచిస్తోంది. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.

టీఎస్పీఎస్సీ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ఓటీఆర్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఒక్కసారి వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైనప్పుడు ఓటీఆర్ ఎంట్రీ చేస్తే సులభంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది. ఫొటో, సంతకం, విద్యార్హతలు వంటివి వివరాలను ప్రతిసారి నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా దరఖాస్తు ప్రక్రియ సింపుల్ గా పూర్తి అవుతుంది. ఈ తరహాలోనే గురుకులాల ఉద్యోగాల భర్తీలోనూ ఓటీఆర్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఎన్ని నోటిఫికేషన్లకు అప్లై చేసుకున్నా.. వ్యక్తిగత వివరాలను మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం ఉండదు.

తదుపరి వ్యాసం