తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  1 Lakh For Bcs :త్వరలోనే లబ్ధిదారులకు రూ. లక్ష సాయం... రూ.400 కోట్లు మంజూరు

1 Lakh For BCs :త్వరలోనే లబ్ధిదారులకు రూ. లక్ష సాయం... రూ.400 కోట్లు మంజూరు

12 July 2023, 16:58 IST

google News
    • Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం రూ.400 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీలకు లక్ష సాయం
బీసీలకు లక్ష సాయం

బీసీలకు లక్ష సాయం

Lakh Aid to Practitioners of BC Caste Occupations: తెలంగాణలోని బీసీ చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం పథకాన్ని తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తికాగా.... లబ్ధిదారుల ఎంపిక పై కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దరఖాస్తులు చేసుకున్న వారిలో నుంచి లబ్ధిదారులను ఖరారు చేయనున్నారు. అయితే ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేసింది తెలంగాణ ప్రభత్వం. రూ.400 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. వీటిని బీసీ కార్పొరేషన్‌ ద్వారా వెచ్చించాలని ఆదేశించింది. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

వచ్చిన దరఖాస్తులను వడపోత పోస్తున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అర్హులను గుర్తింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు గుర్తించిన అర్హులకు ఎమ్మెల్యేల ద్వారా చెక్కులను అందించనున్నారు. త్వరలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి వారి పేర్లను గ్రామ పంచాయతీ బోర్డులపై అంటించనుంది.

మార్గదర్శకాలు…

- లక్ష రూపాయ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు అవుతారు.

-కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు.

- ఆయా కులాల పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.

- దరఖాస్తుదారుల వయస్సు జూన్‌ 2 నాటికి 18 -55 ఏళ్లు ఉండాలి.

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

- దరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు అర్హులు కారు. ఇక 2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు ఈ స్కీమ్ కు అనర్హులు అవుతారు.

- జూన్‌ 20 తేదీ వరకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో కూడిన దరఖాస్తులను స్వీకరించారు.

తదుపరి వ్యాసం