తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Beer Sales In Telangana: బీరు.. జోరు - 18 రోజుల్లోనే 35 లక్షల కాటన్లు ఖాళీ.. టాప్​లో 'నల్గొండ'

Beer Sales in Telangana: బీరు.. జోరు - 18 రోజుల్లోనే 35 లక్షల కాటన్లు ఖాళీ.. టాప్​లో 'నల్గొండ'

HT Telugu Desk HT Telugu

21 May 2023, 10:19 IST

google News
    • Beer Sales in Telangana: తెలంగాణ బీర్లు అమ్మకాలు భారీగా పెరిగాయి. మే నెలలో చూస్తే కేవలం 18 రోజుల్లోనే 583 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
బీర్ల అమ్మకాలు
బీర్ల అమ్మకాలు

బీర్ల అమ్మకాలు

Beer Sales in Telangana: మే నెలలో ఎండలు దంచికొట్టేస్తున్నాయి.. ఇంకేముంది బీరు ప్రియులు వైన్స్ షాపులకు బార్లు తీరుతున్నారు. భారీ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు. ఈ మే నెలలో చూస్తే... రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడుపోయాయి.ఎండలు ముదురుతున్నా కొద్ది బీర్ల అమ్మకాలు​ కూడా అమాంతం పెరుగిపోతున్నాయి. మే 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో బీర్లదే అగ్రస్థానం. కేవలం 18 రోజుల్లోనే 583 కోట్ల రూపాయలు విలువ చేసే బీర్లు అమ్ముడుపోయినట్లు రాష్ట్ర ఎక్సైజ్ వర్గాల సమాచారం మేరకు తెలిసింది.

ఎన్ని కాంటన్లు అంటే...

మే 1వ తేదీ నుంచి 18 తేదీ వరకు మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడుపోయాయి. ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున లెక్కిస్తే సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి. ఈ లెక్కన 18 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను ఖాళీ చేశారు. ఈ 18 రోజుల్లో రూ.582.99 కోట్లు విలువ చేసే బీర్లు అమ్ముడుపోయాయి. మే మాసం ముగిసే నాటికి సర్కార్ ఖజానికి వెయ్యి కోట్ల ఆదాయం చేకూరే అవకాశం ఉంది.

నల్గొండ టాప్…

రాష్ట్రంలో 2,650 వైన్ షాపులు, 1,172 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ 18 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3,00,364 కార్టన్‌ల బీరు విక్రయాలు జరిగాయి. మరోవైపు 18 రోజుల్లో 13,26,347 లిక్కర్ డబ్బాలు మాత్రమే విక్రయించగా... ఈ-సేల్స్ ద్వారా ప్రభుత్వానికి రూ.904.47 కోట్ల ఆదాయం వచ్చింది. రూ.78.42 కోట్ల విలువైన 1,20,334 కార్టన్‌లతో మద్యం(లిక్కర్) విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. లిక్కర్ విక్రయాల్లో నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ నెలలో పెండ్లీలతోపాటు ఇతర ఫంక్షన్లు కూడా ఉండడం బీర్ల అమ్మకాలకు కలిసొచ్చినట్లు అయింది.

ఇక తెలంగాణలో మద్యం విక్రయాలు రికార్డు బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది అయితే తెలంగాణలో మద్యం విక్రయాలు ఆల్ టైం రికార్డు నమోదు చేశాయి. ఏకంగా రూ.34 వేల కోట్లకుపైగా మద్యాన్ని తాగేశారు. 2021లో 2.73 కోట్ల లిక్కర్, 2.45 కోట్ల బీర్ కేసులు విక్రయించగా... గత ఏడాది 3.5 కోట్ల లిక్కర్, 4.5 కోట్ల కేసుల బీర్లు అమ్మాడయ్యాయి. 2020,2021 కంటే గత ఏడాదిలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. 2022 డిసెంబర్ నెలలో రూ.3,376 కోట్ల మద్యం అమ్ముడుపోగా.. 2021 డిసెంబర్‌లో రూ.2,901 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2021 ఏడాది కంటే గత ఏడాది డిసెంబర్‌లో అదనంగా రూ.475 కోట్లు పెరిగింది. 2022 డిసెంబర్ చివరి వారంలో ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగాయి.

తదుపరి వ్యాసం