తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ecet 2022: టీఎస్ ఈసెట్‌ ఫలితాలు విడుదల… ఈ లింక్ తో చెక్‌ చేసుకోండి

TS ECET 2022: టీఎస్ ఈసెట్‌ ఫలితాలు విడుదల… ఈ లింక్ తో చెక్‌ చేసుకోండి

12 August 2022, 13:13 IST

google News
    • Telangana TS ECET Result: తెలంగాణ ఈసెట్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. 
ఈసెట్ పలితాలు 2022
ఈసెట్ పలితాలు 2022 (ecet.tsche.ac.in)

ఈసెట్ పలితాలు 2022

ts ecet results 2022:తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://ecet.tsche.ac.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

తెలంగాణ ఈసెట్ 2022ను జేఎన్టీయూ హైదరాబాద్ జూలై 13న నిర్వహించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష నిర్వహించారు.

రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి...

1. అధికారిక వెబ్ సైట్ ecet.tsche.ac.in ని సందర్శించండి.

2. హోమ్ పేజీలో 'టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి.

3. ఇప్పుడు మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాలి. పూర్తయ్యాక సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.

4. టీఎస్ ఈసెట్ 2022 ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఈసెట్ నిర్వహిస్తారు.డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ అభ్యర్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన వారు నేరుగా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో రెగ్యులర్ బీఈ, బీటెక్ కోర్సుల్లో చేరవచ్చు. అలాగే సెకండియర్ బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోరవచ్చు.

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ఈసెట్ ఫలితాలను చెక్ చేసుకోండి.

TS EAMCET Results 2022: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఫలితాలు కూడా ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు.

టాపర్లు వీరే…

ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఖానామెట్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు నక్కా సాయిదీప్తిక (రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం), మూడో ర్యాంకు పొలిశెట్టి కార్తికేయ (తెనాలి, గుంటూరు), నాలుగో ర్యాంకు పల్లి జలజాక్షి (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), ఐదో ర్యాంకు మెండ హిమవంశీ (బలగ, శ్రీకాకుళం) దక్కించుకున్నారు. అగ్రికల్చర్‌ విభాగంలో.. జూటూరి నేహ (తెనాలి, గుంటూరు)కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు వంటకు రోహిత్‌ (కోటపాడు, విశాఖపట్నం), మూడో ర్యాంకు కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి (కొమెరపూడి, గుంటూరు), నాలుగో ర్యాంకు కొత్తపల్లి మహి అంజన్‌ (కూకట్‌పల్లి), ఐదో ర్యాంకు గుంటుపల్లి శ్రీరామ్‌ (బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు)కు వచ్చాయి.

లింక్ పై క్లిక్ చేసి ఎంసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం