తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ecet 2023 : ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - ఆగస్టు 8న సీట్ల కేటాయింపు, ముఖ్య తేదీలివే

TS ECET 2023 : ఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - ఆగస్టు 8న సీట్ల కేటాయింపు, ముఖ్య తేదీలివే

23 July 2023, 8:46 IST

google News
    • TS ECET  Latest Updates 2023: తెలంగాణ ఈసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ముఖ్య తేదీలను ప్రకటించింది. 
తెలంగాణ ఈసెట్ 2023
తెలంగాణ ఈసెట్ 2023

తెలంగాణ ఈసెట్ 2023

TS ECET Counselling 2023: తెలంగాణ ఈసెట్‌ -2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు తెలంగాణ ఈసెట్‌ నిర్వహించారు. అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… జులై 29 నుంచి ఆగస్టు 1 వరకు అభ్యర్థులు స్లాట్ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.

జులై 31వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 8న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. ఆగస్టు 20 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపడతారు. ఆగస్టు 26న తుది విడత సీట్లను కేటాయిస్తారు. రెండు విడతల్లో సీట్లు పొందిన వారు ఆగస్టు 26 నుంచి 30 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల అవుతాయి. గతేడాది ఈసెట్‌లో 11 వేలకు పైగా సీట్లు ఉండగా.. 10 వేల సీట్లు భర్తీ అయ్యాయి.

ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 175 కాలేజీల్లో 11 వేలకు పైగా సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఈసెట్ ఎగ్జామ్ కు దాదాపు 22 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 20,899 మంది ఉత్తీర్ణత పొందారు. https://ecet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లతో పాటు మిగతా పక్రియను పూర్తి చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డులు కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్

TS PGECET 2023 Counselling: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. జులై 28వ తేదీన పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. కౌన్సెలింగ్‌ ప్రక్రియను జులై 31 నుంచి నిర్వహించనున్నారు. ఫలితంగా జులై 31 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. వెబ్‌ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 26న మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ముఖ్య తేదీలు:

నోటిఫికేషన్ -28.07.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ - 31.07.2023 - 09.08.2023.

అర్హులైన వారి జాబితా - 20.08.2023.

వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ- 21. 08. 2023 - 23.08.2023.

తొలివిడత సీట్ల కేటాయింపు - 26.08.2023.

రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ - 04.09.2023 - 23.09.2023.

తరగతులు ప్రారంభం - 19.09.2023.

అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/

తదుపరి వ్యాసం