తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eapcet 2024 Updates : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఈఏపీసెట్‌ అప్లికేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్ - లింక్ ఇదే

TS EAPCET 2024 Updates : విద్యార్థులకు అలర్ట్... తెలంగాణ ఈఏపీసెట్‌ అప్లికేషన్లకు ఇవాళే లాస్ట్ డేట్ - లింక్ ఇదే

06 April 2024, 11:38 IST

    • TS EAPCET 2024 Updates : టీఎస్ ఈఏపీసెట్‌ ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(ఏప్రిల్ 06) పూర్తి కానుంది. ఇప్పటికే మూడు లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
TS EAMCET 2024 registration ends today, link here
TS EAMCET 2024 registration ends today, link here (https://eapcet.tsche.ac.in/)

TS EAMCET 2024 registration ends today, link here

TS EAPCET 2024 Registration Updates: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్‌-2024 దరఖాస్తుల(TS EAPCET 2024 Registration) గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 3 లక్షలకుపైగా అప్లికేషన్లు రాగా…. ఏప్రిల్ 06వ తేదీతో గడువు ముగియనుంది. అయితే ఇది కేవలం ఆలస్యం రుసుం లేకుండా మాత్రమే. ఆలస్య రుసుము ఫీజుతో కలిసి మే 4వ తేదీ వరకు కూడా అప్లయ్ చేసుకునే వీలు ఉంది.

ఆలస్య రుసుం లేకుండా ఇవాళే లాస్ట్ డేట్

  • ఏప్రిల్ 06వ తేదీతో దాటితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆలస్య రుసుం చెల్లించాలు.
  • ఏప్రిల్ 8 నుంచి 12 వరకు విద్యార్థులు ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
  • రూ.250 ఆలస్య రుసుము చెల్లించి ఏప్రిల్ 9వ తేదీ వరకు అప్లయ్ చేయవచ్చు.
  • రూ.500 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆలస్య రుసుము రూ.2500తో ఏప్రిల్ 19 వరకు, రూ.5 వేల ఆలస్య రుసుముతో మే 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
  • మే 1 నుంచి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను(TS EAPCET Hall Tickets 2024) డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
  • ఈ ప్రవేశ ప‌రీక్షలను ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిర్వహిస్తారు.
  • మే 7, 8 తేదీల్లో అగ్రికల్చరల్‌, ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి.
  • మే 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
  • https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవటంతో పాటు హాల్ టికెట్లను కూడా డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది.

How to register TS EAMCET 2024: ఇలా అప్లయ్ చేసుకోండి

  • తెలంగాణ ఈఏపీసెట్‌ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • TS EAMCET 2024 registration అనే లింక్ హోంపేజీలో కనిపిస్తుంది.
  • ముందుగా మీరు రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఓటీపీతో ప్రాసెస్ ఉంటుంది.
  • Pay Registration Fee పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  • Fill Online Application అప్షన్ పై నొక్కి మీ వివరాలను ఎంట్రీ చేయాలి. తప్పుడు సమాచారం ఇవ్వొద్దు. సబ్మిట్ బటన్ పై నొక్కితే ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • Print Filled-in Application అనే ఆప్షన్ పై నొక్కి మీ దరఖాస్తు కాపీని పొందవచ్చు,
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ను భద్రంగా ఉంచుకోవాలి. హాల్ టికెట్ల డౌన్లోడ్ సమయంలో ఉపయోగపడుతుంది.

తెలంగాణ ఈఏపీసెట్‌ కు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. మిగతా అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి. రెండు పేపర్లు రాస్తే… ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 1000, మిగతా వారు రూ. 1800 చెల్లించాలి.

తదుపరి వ్యాసం