తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Bayyaram Protest | కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వివక్ష.. కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా

TRS Bayyaram Protest | కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వివక్ష.. కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా

HT Telugu Desk HT Telugu

23 February 2022, 18:19 IST

google News
    • బయ్యారం ఉక్కు కార్మాగారం ఏర్పాటు చేయాలని.. డిమాండ్ చేస్తూ.. టీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ఆందోళనలో పెద్ద ఎత్తున నేతలు పాల్గొన్నారు. తెలంగాణపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందంటూ... నినాదాలు చేశారు.
బయ్యారం ఉక్కు కోసం టీఆర్ఎస్ నిరసన దీక్ష
బయ్యారం ఉక్కు కోసం టీఆర్ఎస్ నిరసన దీక్ష (twitter)

బయ్యారం ఉక్కు కోసం టీఆర్ఎస్ నిరసన దీక్ష

మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. టీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. బయ్యారంలో చేపట్టిన ఈ ఉక్కు నిరసనదీక్షలో ఎంపీ కవిత, జడ్పీ ఛైర్‌పర్సన్ బింధు, ఎమ్మెల్యేలు హరిప్రియ, శంకర్ నాయక్, రాములు నాయక్, రెడ్యానాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తదితరులు పాల్గొన్నారు. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు.. అంటూ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ముగింపు కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాజరై.. దీక్షను విరమింప చేశారు.

తెలంగాణపై కేంద్రం కావాలనే సవతి తల్లి ప్రేమను చూపిస్తుంది.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారనే... తెలంగాణపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. మరోవైపు బయ్యారం ఉక్కు కోసం.. కాంగ్రెస్ ఆందోళన చేస్తామనడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా పట్టించుకోని వారు.. ఇప్పుడేంచేస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు రాజీనామా చేసే వరకూ వదిలిపేట్టేదే లేదని ఎర్రబెల్లి అన్నారు.

'విభజన చట్టంలో కల్పించిన హక్కు బయ్యారం ఉక్కు పరిశ్రమ. బీజేపీ ఎంపీలకు మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులు కాల రాసేలా కేంద్రం ప్రవర్తిస్తోంది. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెబితే రాజీనామా చేస్తా. దేశంలో అన్ని పార్టీలను ఏకం చేసి బీజేపీని తరిమేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి ఉంది. తెలంగాణ ప్రభుత్వ హక్కులు కాలరాసేలా కేంద్రం వ్యవహారం ఉంది. మతాలు, కులాల పేరిట గొడవలు చేసి.. ఓట్లు పొందడమే భాజపా ఉద్దేశం.' అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

తదుపరి వ్యాసం