తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Boy Death: సిద్దిపేటలో విషాదం..నీటి సంపులో పడికుమారుడు మృతి, భోరున విలపిస్తున్న తల్లితండ్రులు

Siddipet Boy Death: సిద్దిపేటలో విషాదం..నీటి సంపులో పడికుమారుడు మృతి, భోరున విలపిస్తున్న తల్లితండ్రులు

HT Telugu Desk HT Telugu

04 October 2024, 13:07 IST

google News
    • Siddipet Boy Death:మూడు సంవత్సరాల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్ళి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని కమ్మర్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లితండ్రులు భోరున విలపిస్తున్నారు.
సంపులో పడి బాలుడి మృతి
సంపులో పడి బాలుడి మృతి

సంపులో పడి బాలుడి మృతి

Siddipet Boy Death: సంపుపై మూత పెట్టకపోవడంతో మూడేళ్ల బాలుడు అందులో పడి మృతి చెందిన ఘటన సిద్ధిపేటలో జరిగింది. కమ్మర్లపల్లి గ్రామానికి చెందిన బైకని వేణు, రేణుక దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు రుద్రన్ష్ (3) ఉన్నారు. కాగా వేణు ఇంటి ఆవరణలో కొత్తగా సంపూ నిర్మించి, దానిని నీటితో నింపారు. కానీ సంపుపై మూత వేయలేదు. ధోనితో బుధవారం సాయంత్రం బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు సంపులో పడ్డాడు.

అనంతరం కొడుకు కనపడకపోవడంతో తల్లి రేణుక ఇంటి చుట్టుపక్కల మొత్తం వెతికింది. బాలుడు ఎక్కడ కనపడకపోవడంతో సంపు వద్దకు వచ్చి చూడగా అందులో పడి ఉన్నాడు. అది చుసిన తల్లి భోరున విలపించడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకొని బాబుని బయటకు తీసి చూసేసరికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

వెంటనే చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాబు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇద్దరు కుమార్తెల తర్వాత ఒక్కగానొక్క కుమారుడు జన్మించడంతో ఆ తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. ఆ బాలుడు సంపులో పడి మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. బాబు తండ్రి వేణు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మెదక్ లో మరో ఘటన .....

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం టేక్మాల్ గ్రామానికి చెందిన బాజా మోహన్ (29) వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం వ్యబివాసాయ బావి వద్దకు వెళ్లిన మోహన్ రాత్రి వరకు తిరిగి రాలేదు.

దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎంత వెతికిన అతని ఆచూకీ లనించలేదు. చివరికి ఎక్సాన్పూర్ శివారులో ఉన్న నీటి గుంటలో శవమై కనిపించాడని స్థానికుల ద్వారా సమాచారం అందింది. వెంటనే కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా అతడి మొఖంపై గాయాలు ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మోహన్ ముఖంపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అతడికి భార్య సునీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తదుపరి వ్యాసం