తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Revanth Reddy Padayatra: Bjp, Brs పార్టీలది దొంగ డ్రామా...పీకే డైరెక్షన్ లోనే నడుస్తుందన్న రేవంత్

Revanth reddy Padayatra: BJP, BRS పార్టీలది దొంగ డ్రామా...పీకే డైరెక్షన్ లోనే నడుస్తుందన్న రేవంత్

12 March 2023, 10:01 IST

Hath Se Hath Jodo Yatra Updates: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్‌ సే హాత్‌ జోడో యాత్ర శనివారంతో ముగిసింది. కోరుట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? అని సూటిగా ప్రశ్నించారు.  లిక్కర్ స్కామ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి… బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు.

  • Hath Se Hath Jodo Yatra Updates: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రేవంత్ రెడ్డి చేపట్టిన ‘హాథ్‌ సే హాత్‌ జోడో యాత్ర శనివారంతో ముగిసింది. కోరుట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్‌ రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం నీళ్లు కోరుట్లకు వచ్చాయా? అని సూటిగా ప్రశ్నించారు.  లిక్కర్ స్కామ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి… బీజేపీ, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లోనే ఇదంతా నడుస్తోందని ఆరోపించారు.
ఎన్నికలప్పుడు ముత్యంపేట చెక్కర ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని రైతుల ఓట్లు దండుకొని..ఇప్పుడు ముగిసిన అధ్యాయం అని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.   కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని హామీనిచ్చారు.
(1 / 5)

ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని కేసీఆర్‌ను ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఎందుకు ప్రశ్నించరు? అని రేవంత్ రెడ్డి నిలదీశారు. అసద్‌ ఓటేయమని ప్రజలను అడగడం బాగానే ఉంది కానీ, కేసీఆర్‌ను మోదీ ముందు మోకరిల్లొద్దని ఎందుకు చెప్పడం లేదని దుయ్యబట్టారు.  
(2 / 5)

త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందన్న రేవంత్ రెడ్డి... తెలంగాణ తెచ్చిన అని చెప్పుకొంటున్న కేసీఆర్‌కు ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తొమ్మిదేళ్లలో కేసీఆర్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. 
(3 / 5)

పాదయాత్రలో భాగంగా శనివారం కోరుట్లలో పసుపు రైతులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి… వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పసుపు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. 
(4 / 5)

లిక్కర్ స్కామ్ పై స్పందించిన రేవంత్ రెడ్డి... బీజేపీ,  బీఆర్ఎస్ కలిసి ప్రశాంత్ కిషోర్  డైరెక్షన్లో ఆడుతున్న దొంగ డైవర్షన్ డ్రామాగా అభివర్ణించారు. లిక్కర్ స్కామ్ లో  తప్పు చేసిన కవితను బొక్కలో తొయ్యకుండా పేరంటానికి పిలుస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేకత, ప్రజా సమస్యలను కప్పిపుచ్చుడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న దొంగ డ్రామా అని... ఇదంతా కేవలం టైంపాస్ అని చెప్పారు. 
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి