తెలుగు న్యూస్  /  ఫోటో  /  Revanth Reddy At Manneru: ఇసుక దోపిడీలో కేసీఆర్ కుటుంబం.. ఈటల ఎక్కడకు పోయిండన్న రేవంత్

Revanth reddy at Manneru: ఇసుక దోపిడీలో కేసీఆర్ కుటుంబం.. ఈటల ఎక్కడకు పోయిండన్న రేవంత్

01 March 2023, 15:30 IST

Revanth reddy Padayatra Updates: రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నేతలతో కలిసి మానేరు వాగును పరిశీలించారు.  ఇసుకు మాఫియాతోనే కాళేశ్వరం ముంపునకు గురి అయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారని… ఒకే పర్మిట్‌తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని దుయ్యబట్టారు. మానేరును కొల్లగొడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.

  • Revanth reddy Padayatra Updates: రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నేతలతో కలిసి మానేరు వాగును పరిశీలించారు.  ఇసుకు మాఫియాతోనే కాళేశ్వరం ముంపునకు గురి అయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారని… ఒకే పర్మిట్‌తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని దుయ్యబట్టారు. మానేరును కొల్లగొడుతుంటే స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.
మానేరు వాగులో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రెడ్డి పరిశీలించారు.య బీఆర్ఎస్ నాయకులు శాండ్, ల్యాండ్, మైన్లను ఆదాయ వనరుగా చేసుకుని, ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని అంతమొందిస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ కుటుంబమే ఈ దోపిడీకి వెనక ఉందని ఆరోపించారు.
(1 / 4)

మా సభలపై బీఆర్ఎస్ దాడులకు దిగిందంటే వారిలో భయానికి సంకేతమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుర్చీ కింద బీటలు పడుతుందనే ఇలాంటి దాడులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఏ దాడులకు భయపడం..పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు.
(2 / 4)

ఇంత జరగుతున్నా.. ప్రభుత్వంపై యుద్ధం చేస్తానన్న బీజేపీ నేత నేత ఈటల ఎక్కడకు వెళ్లారని  రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈటెల, బండి సంజయ్ ఈ దోపిడీపై స్పందించాలన్నారు. ఈ దోపీడీని అడ్డుకునేందుకు వారి కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదంటే.. బీఆర్ఎస్, బీజేపీ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు.
(3 / 4)

రాజ్యమేలుతున్న ఈ చీడ పురుగులను  తెలంగాణ పోలిమేరల దాకా తరిమేందుకే ఈ పాదయాత్ర కొనసాగుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
(4 / 4)

    ఆర్టికల్ షేర్ చేయండి