తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కేసీఆర్ ఫౌంహౌస్ పంట కొనేవారే రైతుల పంట కొనాలి - రేవంత్ రెడ్డి

కేసీఆర్ ఫౌంహౌస్ పంట కొనేవారే రైతుల పంట కొనాలి - రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

19 March 2022, 12:43 IST

google News
    • సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో ‘సర్వోదయ సంకల్ప పాదయాత్ర’లో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ ఫౌంహౌస్ లోని పంట ఎవరు కొంటారో వారే పేద రైతుల వద్ద వరి కోనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి
సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి (twitter)

సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

పేద రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న సర్వోదయ సంకల్ప పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.పేద రైతుల వరి కొనకపోతే గజ్వేల్ నడిబొడ్డున కేసీఆర్ ను ఉరి తీస్తామంటూ కామెంట్స్ చేశారు. రైతులను వరి వేయవద్దన్న కేసీఆర్.. తన ఫాంహౌస్ లోని 150 ఎకరాలలో వరి వేశారని ఆరోపించారు. కేసీఆర్ పంట ఎవరు కొంటారో వారే పేద రైతుల వద్ద వరి కూడా కొనాలన్నారు.

రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో స్థానికంగా ఉన్న పేద రైతుల భూములను ప్రభుత్వం గుంజుకుందని రేవంత్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఎకరాకు  రూ. 3 కోట్ల నుంచి  రూ. 5 కోట్ల వరకు ఉంటే ప్రభుత్వం రైతులకు కేవలం 10 లక్షలు మాత్రమే ఇస్తుందని దుయ్యబట్టారు.

“కేసీఆర్ ఫామ్ హౌస్ లో 500 ఎకరాల భూమి ఉంది.  ఎకరాకు 10 లక్షల చొప్పున తీస్కొని ఆ భూమిని ఇక్కడ భూములు కోల్పోయిన వారికి పంచాలి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల  కింద 50 ఎకరాలు ముంపు అయ్యాయి. కేసీఆర్ తన ఫామ్ హౌస్ కు కొండపోచమ్మ సాగర్ నుంచి నేరుగా కాలువ వేసుకున్నారు. తన బంధువు కావేరి సీడ్స్ యజమాని భూమి మునగకుండా జలాశయాన్ని రీ డిజైన్ చేశారు. పేదల భూములు ముంచి వీళ్లు  బాగుపడ్డారు. పేద రైతుల సమస్యలను ఎత్తి చూపి పరిష్కరించేందుకే ఈ సర్వోదయ పాదయాత్ర చేపట్టాం” - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ధరణి వెబ్ సైట్లో తప్పులే ఉన్నాయని.. ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.  ఆడబిడ్డ మీనాక్షి నటరాజన్ రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నారని.. ఆమె పాదయాత్ర అయ్యే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు తోడుగా ఉండాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, వినోబా భావేల స్ఫూర్తి తోనే కాంగ్రెస్ పార్టీ శాంతియుత పాదయాత్రలతో ప్రజా పోరాటాలు చేస్తుందన్నారు.

భూదాన్ ఉద్యమం 75 ఏళ్లు  అయిన సందర్బంగా ఈ నెల 14 నుంచి  రాజీవ్‌గాంధీ పంచాయతీ సంఘటన్‌ జాతీయ చైర్మన్‌ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో భూదాన్ పోచంపల్లి నుంచి  పాదయాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర మహారాష్ట్రలోని సేవాగ్రాం వరకు కొనసాగనుంది.  యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ఓ రోజు పాల్గొనే అవకాశం ఉంది.

తదుపరి వ్యాసం