తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Police Jobs: 17,516 పోలీసు ఉద్యోగాలు.. ఒక్కో పోస్టుకు పోటీ ఎలా ఉందంటే….

TS Police Jobs: 17,516 పోలీసు ఉద్యోగాలు.. ఒక్కో పోస్టుకు పోటీ ఎలా ఉందంటే….

HT Telugu Desk HT Telugu

27 May 2022, 14:43 IST

    • Telangana Police Recruitment 2022: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసింది. 17,516 ఉద్యోగాల సంబంధించి భారీగా అప్లికేషన్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు నియామక మండలి బోర్డు అధికారులు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు,
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు,

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ దరఖాస్తులు,

Telangana Police Recruitment 2022: పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వేగంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చిన బోర్డు... ఇక పరీక్షల నిర్వహణపై కూడా ఫోకస్ పెట్టింది. మరోవైపు గురువారంతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే 17,516 ఉద్యోగాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

అప్లికేషన్స్ సంఖ్య…

పోలీస్‌, ఎక్సైజ్‌, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇచ్చారు. గడువు ముగిసే సమయానికి 7 లక్షల 30 వేల మంది అభ్యర్థుల నుంచి 12.70 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్క పోస్టుకు సగటున 70కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అయింది. డేటాను సెంట్రలైజ్‌‌‌‌ చేసిన తర్వాత కేటగిరీల వారీగా పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మహిళల నుంచి భారీగానే..

సివిల్‌‌‌‌, ఏఆర్‌‌‌‌‌‌‌‌ ఎస్ఐ, కానిస్టేబుల్‌‌‌‌, జైల్‌‌‌‌ వార్డర్స్‌‌‌‌ కోసం మహిళలు భారీ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దాదాపు 3 లక్షలకు పైగా అప్లికేషన్స్ వచ్చినట్లు అధికార వర్గాల నుంచి తెలుస్తోంది. నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచి రోజుకు సగటున 49 వేల మంది చొప్పున దరఖాస్తు చేసుకొన్నట్టు బోర్డు అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే మహిళల నుంచి దరఖాస్తులు రావటం ఇదే తొలిసారి అని 

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడంటే..

ఇక ఆగస్టు 7న ఎస్సై పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది రిక్రూట్ మెంట్ బోర్డు. అదే నెల 21న కానిస్టేబుల్‌ పోస్టులకు పరీక్షలు నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేసింది.అనుకోని అవాంతరాలు ఎదురుకాకపోతే దాదాపుగా ఇవే తేదీలు ఖరారు కానున్నాయి. ఇప్పటికే పలు బోర్డుల నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు ఒక్కొకటిగా వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మరోవైపు ఆర్ఆర్ బీ పరీక్షలు ఉన్నాయి. ఇక విద్యాశాఖ నిర్వహించే టెట్ తేదీలను కూడా ఖరారయ్యాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే ప్రిలిమినరీ తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. పరీక్షల తేదీలు ఒకేరోజు రాకుండా చూడటంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

తొలుత జూన్ ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించాలని భావించినా, ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో రెండేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు దాఖలుకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ప్రిలిమినరీ రాత పరీక్ష తరువాత అర్హులైన వారికి మాత్రమే ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిపై అయితేనే మెయిన్స్ రాసేందుకు వీలవుతుంది. వీటిలో మెరిట్ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు. ఈ నేపథ్యంలో మెయిన్స్ రాత పరీక్షతో పాటు ఈవెంట్స్ కూడా కీలకమే కానున్నాయి. కాంపిటిషన్ అధికంగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి టాస్క్ ను సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

టాపిక్

తదుపరి వ్యాసం