తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Nomination : సెంటిమెంట్ తప్పని గులాబీ బాస్...! ఇవాళ కోనాయిపల్లికి కేసీఆర్

KCR Nomination : సెంటిమెంట్ తప్పని గులాబీ బాస్...! ఇవాళ కోనాయిపల్లికి కేసీఆర్

HT Telugu Desk HT Telugu

04 November 2023, 5:53 IST

google News
    • Telangana Assembly Elections 2023: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ కోనాయిపల్లిలో పర్యటించనున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శించుకోవటంతో పాటు నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించనున్నారు.
కేసీఆర్
కేసీఆర్

కేసీఆర్

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం కోనాయిపల్లి ఆలయంలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోనున్నారు.సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి పాదాల చెంత ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్ అయిన కోనాయిపల్లి లో ప్రతి ఎన్నికలలో నామినేషన్ వేసేముందు నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాతనే నామినేషన్ వేస్తారు. ఈ సారి కూడా సీఎం అదే సెంటిమెంట్ అనుసరిస్తున్నారు.శనివారం కోనాయిపల్లి ఆలయంలో పూజలు నిర్వహించి నవంబర్ 9 వ తేదీన ఒకేరోజు గజ్వేల్,కామారెడ్డి నియోజకవర్గాలలో నామినేషన్ వేస్తారు.

మొదటి నుండి ఇక్కడే పూజలు ...

198 లో తొలిసారిగా సిద్ధిపేట ఎమ్మెల్యే గా పోటీ చేసిన దగ్గర నుండి ఇప్పటివరకు ప్రతిసారి సీఎం కేసీఆర్ ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే నామినేషన్ వేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.ఆర్ధిక మంత్రి హరీష్ రావు,మెదక్ ఎంపీ(దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి ) కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇక్కడ పూజలు చేసిన తర్వాతనే తమ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు నుండి తెలంగాణ రాష్ట్రము లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.ఎమ్మెల్యే లుగా పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల అధికారుల వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించాలి.

పటిష్టమైన బందోబస్తు ...

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ శ్వేతా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పర్యటన సందర్భంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సీఎం వెళ్లే కాన్వాయ్ రోడ్ కోనాయిపల్లి టెంపుల్ వద్ద ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశాలను తదితర ప్రాంతాలను పోలీస్ అధికారులతో కలిసి సందర్శించి తగు సూచనలు సలహాలు చేశారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, విధి నిర్వహణలో ఉండే పోలీసుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. వాహనాలను పార్కింగ్ ప్రదేశాలలో పార్కు చేయాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలను పార్కు చేయవద్దని తెలిపారు.అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు,పోలీస్ సిబ్బందితో 4 సెక్టార్లుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ప్రతి పోలీస్ అధికారి సిబ్బంది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండి విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అనుసరించి విధులు నిర్వహించాలని సూచించారు.

రిపోర్టింగ్ : ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి

తదుపరి వ్యాసం