Teenmar Mallanna: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న, ఫలితాలపై ఉత్కంఠ
06 June 2024, 8:54 IST
- Teenmar Mallanna: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కౌంటింగ్ కొనసాగుతోంది. రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేనాటికి కాంగ్రెస్ 14 వేల ఓట్ల ఆధిక్యంలో ఉంది.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఆధిక్యం
Teenmar Mallanna: గ్రాడ్యేయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం బీఆర్‌ఎస్ పార్టీకి ఓటర్లు షాక్ ఇచ్చేలా ఉన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి నిలిచారు.
లక్షా 92 వేల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో సుమారు 14 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. మొదటి ప్రాధాన్యతలో లెక్కించాల్సిన ఓట్లు లక్షా 44 వేల ఓట్లు ఉన్నాయి. చెల్లని ఓట్లు వేరు చేయాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో రౌండ్ పూర్తయ్యే నాటికి తీన్మార్ మల్లన్న 14వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మొత్తం నాలుగు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. మూడో రౌండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యం సాధింాచరు. రెండు రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు 14,672 ఓట్ల ఆధిక్యత లభించింది. ఇందులో మొదటి రౌండ్‌లో 7670 రెండో రౌండ్ లెక్కింపులో 7002 ఓట్లతో మొత్తం 14672 ఓట్లు ఆధిక్యత వచ్చింది.
కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు రెండో రౌండ్‌లో - 34,575 ఓట్లు లభించాయి. మొదటి రౌండ్‌లో 36210ఓట్లు రెండో రౌండ్‌లో 34575ఓట్లు వచ్చాయి. రెండు రౌండ్లలో కలిపి 70785 ఓట్లు వచ్చాయి.
బిఆర్‌ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి రెండు రౌండ్ల లెక్కింపులో రెండో రౌండ్ లెక్కింపులో 27,573 ఓట్లు వచ్చాయి. మొదటి విడతలో 28540ఓట్లు, రెండో విడతలో 27573 ఓట్లు మొత్తం 56113 ఓట్లు లభించాయి.
బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి రెండో రౌండ్‌లో 12,841 ఓట్లు లభించాయి. మొదట విడతలో 11395ఓట్లు రెండో విడతలో 12841 ఓట్లు, మొత్తం 24236 ఓట్లు లభించాయి.
స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్‌కు 11,018 ఓట్లు లభించాయి. అశోక్‌కుమార్‌కు మొదటి రౌండ్‌లో 9109ఓట్లు రెండో విడతలో11018 ఓట్లు మొత్తం 20127 మొదటి ప్రాధాన్య ఓట్లు లభించాయి. దాదాపు పదివేలకు పైగా చెల్లని ఓట్లు నమోదయ్యాి.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలు దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెలువడ్డాయి. గురువారం ఉదయం రెండో రౌండ్ ఫలితాలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నానికి పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని కలెక్టర్ దాసరి హరిచందన చెప్పారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతతో బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ చందనాదీప్తి వెల్లడించారు.