Kisan Agrishow: హైదరాబాద్‌లో అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో 2024’
30 January 2024, 12:41 IST
- Kisan Agrishow: హైదరాబాద్‌లో కిసాన్ అగ్రి షో 2024, 2వ ఎడిషన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.
హైదరాబాద్‌లో కిసాన్ అగ్రిషో నిర్వహణకు ఏర్పాట్లు
Kisan Agrishow: హైదరాబాద్‌లో కిసాన్ అగ్రిషో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన అయిన ‘కిసాన్ అగ్రి షో 2024’ (2వ ఎడిషన్)కు వేదికగా హైదరాబాద్ సిద్ధమవుతోంది. HITEX ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనలో భాగంగా వ్యవసాయరంగ నిపుణులు, రైతులు, పాలసీ మేకర్స్ తదితర ఔత్సాహికులు ఒకే వేదికపైకి చేరనున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగే ఈ మూడు రోజుల వ్యవసాయ ప్రదర్శన వ్యవసాయ రంగాన్ని నూతన ఒరవడులతో విప్లవాత్మకంగా మార్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం ‘కిసాన్ అగ్రి షో 2024’ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు.
12000 చ.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అతిపెద్ద వేదికలోని ఎగ్జిబిషన్ మూడు రోజుల్లో దాదాపు 140పైగా కంపెనీలను కలుపుతుంది. వ్యవసాయంలోని తాజా ఉత్పత్తులు, వినూత్న భావనలు ఇక్కడ ప్రదర్శిస్తారు.
హైదరాబాద్‌లో జరిగిన మొదటి ఎడిషన్ కిసాన్ అగ్రి షో విజయవంతమైన తర్వాత, రెండవ ఎడిషన్‌కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 140 కంటే ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు, 20,000 పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ సంబంధిత రంగాల నుంచి మొదటి ఎడిషన్ అద్భుతమైన స్పందనను పొందడంతో పాటు ఇందులో భాగమైన కంపెనీలకు, రైతులకు ప్రయోజనకరంగా మారింది.
ఎగ్జిబిటర్లకు తమ వినూత్న ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రిషో హైదరాబాద్ 2024 చక్కటి వేదికను తయారు చేసింది. ఈ వేదికలో పరిశ్రమలోని తాజా పరిణామాలను పంచుకోవడానికి, చర్చించడానికి వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక్కడి ప్రగతిశీల రైతులంతా అగ్రి ఎగ్జిబిషన్‌లో కలుస్తారు.
ఇది రైతుల అనుసంధానంతో పాటు విజ్ఞాన మార్పిడికి ప్రధాన అవకాశంగా మారింది. ఇదే వేదికలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్స్ అందించడానికి ఏకకాలిక సదస్సును నిర్వహిస్తోంది.
కిసాన్ ఎగ్జిబిషన్ ఫార్మ్ మెషినరీ, వాటర్ & ఇరిగేషన్, ప్లాస్టికల్చర్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వంటి వాటిపై దృష్టి సారిస్తుంది. రైతులకు ఆసక్తి ఉన్న విషయాలను గుర్తించడంలో ఈ ప్రదర్శన సహాయపడుతుంది.వేదికలోని ఓపెన్ అరేనాలో పెద్ద ట్రాక్టర్లు, అగ్రి మెషినరీ తదితర వ్యవసాయ ఉపకరణాలను ప్రదర్శిస్తారు.